Pushpa Movie : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ ఎర్ర చందనం చెట్లను నరికే కూలీగా జీవితాన్ని ప్రారంభించి చివరకు వాటిని అమ్మే లీడర్ స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలోనే సినిమాలో పుష్ప రాజ్ ఒక్కో మెట్టు ఎదుగుతూ చివరకు స్మగ్లింగ్ గ్యాంగ్‌కు లీడర్ అవుతాడు.
ఈ సినిమాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ప్రధాన అంశంగా ఉంటుంది. పుష్ప రాజ్ ఎర్ర చందనాన్ని అనేక విధాలుగా స్మగ్లింగ్ చేస్తాడు. పోలీసులకు దొరక్కుండా అత్యంత చాకచక్యంగా ఎర్ర చందనం లోడ్‌లను చెక్ పోస్టులను దాటిస్తాడు. అయితే దీన్నే ప్రేరణగా తీసుకున్న ఓ వ్యక్తి ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేయబోయాడు. చివరకు పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి రూ.2.50 కోట్ల విలువైన ఎర్ర చందనం దుంగలను లారీ వేసుకుని పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే తనిఖీల్లో పట్టుబడకుండా ఉండేందుకు గాను పుష్ప సినిమాలోలాగా.. లారీలో పైన కూరగాయలను పెట్టాడు. వాటి కింద ఎర్ర చందనం కలపను ఉంచాడు. ఈ క్రమంలోనే చెక్ పోస్ట్ వద్ద పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే మొదట వారికి అనుమానం కలగలేదు. కానీ ఎందుకైనా మంచిదని లారీ మొత్తాన్ని మళ్లీ తనిఖీ చేశారు. దీంతో చివరకు అందులో ఎర్ర చందనం కలప పట్టుబడింది. ఈ క్రమంలో ఆ కలపను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
అయితే పుష్ప సినిమాపై ప్రముఖ సహస్ర అవధాని గరికపాటి నరసింహారావు తాజాగా విమర్శలు చేశారు. స్మగ్లింగ్‌ను గొప్పగా చూపించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఆ సినిమా చూసి సమాజం చెడిపోతే అందుకు ఎవరు బాధ్యత వహించాలని అన్నారు. అలా ఆయన అన్న తరువాతే పైన తెలిపిన సంఘటన జరగడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…