Actress Hema : ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటిన హేమ అప్పుడప్పుడూ వివాదాలతో వార్తలలో నిలుస్తూ ఉంటోంది. ఇటీవల బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ బయటపడడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఇందులో సుమారు 150 మంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు పట్టుబడడంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు వేగవంతమయ్యాయనే చర్చకు తెరలేచింది. అయితే నటి హేమ పేరు కూడా తెరపైకి రావడం తీవ్ర దుమారం రేపింది. అసలు పబ్‌కే వెళ్లని తనపేరును ఏ విధంగా ప్రచారంలోకి తెస్తారంటూ ఆమె ఆవేశంతో మీడియా ప్రతినిధులను నిలదీసింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న చానళ్లపై ఫిర్యాదు చేసేందుకు ఆమె బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.

అసలు తాను అసలు పబ్‌కు వెళ్లలేదన్నారు. అలాంటప్పుడు తన పేరును డ్రగ్స్ కేసులో ఎలా ఇరికిస్తారని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదన్నారు. తనకు కూతురు, కుటుంబం ఉందని, సంబంధం లేని విషయంలో దుష్ప్రచారం చేయడం ద్వారా ఎంతగా ఆవేదన చెందాల్సి వస్తుందో అర్థం చేసుకోవాలని కోరారు. కొందరు కావాలనే తన పేరును ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హేమ. అయితే ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌లో తన పేరు స్క్రోలింగ్‌ను చూసినప్పుడు ఓ జర్నలిస్ట్‌ని పిలిచానని హేమ చెప్పుకొచ్చింది.
సీనియర్ మోస్ట్ క్రైమ్ రిపోర్టర్ గా పేరున్న ఓ జర్నలిస్టును పోలీస్ స్టేషన్‌కు పిలిపించానని.. డ్రగ్స్ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు అతనికి ఎలా తెలిసింది.. ఎవరు చెప్పారు.. వంటి వివరాలపై క్లారిటీ ఇచ్చేందుకు స్టేషన్‌కు రమ్మని పిలిచానని.. అయితే అతను రాలేదని.. పారిపోయాడని.. హేమ తెలిపారు. చూస్తుంటే తనను కేవలం అన్‌పాపులర్ చేసేందుకే ఇలా కొందరు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుందని అన్నారు. కేవలం టీఆర్‌పీ కోసమే ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని నటి హేమ అడిగారు. అయితే ఇది నటి హేమ వెర్షన్ అని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంత ఉంది.. అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.