Aaradugula Bullet : గోపీచంద్ ఇటీవలి కాలంలో నటించిన సినిమాలు ఏవీ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ మధ్యే రిలీజ్ అయిన సీటీమార్ మూవీ కొంత మేరకు ఫర్వాలేదనుకున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. ఇక ఎప్పుడో 4 ఏళ్ల కింద రిలీజ్ కావల్సిన ఆరడుగుల బుల్లెట్ మూవీని ఈ మధ్యే రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ వచ్చి వెళ్లినట్లు కూడా చాలా మందికి తెలియదు.
కాగా ఆరడుగుల బుల్లెట్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ప్రేక్షకులు ఈ మూవీని అమెజాన్‌లో వీక్షించవచ్చు. ఇందులో గోపీచంద్ సరసన నయనతార నటించింది. 4 ఏళ్ల కిందట రిలీజ్ కావల్సిన ఈ మూవీ ఆర్థిక సమస్యల కారణంగా విడుదల కాలేదు. అయితే తాజాగా థియేటర్లలో విడుదలైనా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇక గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్‌ఫుల్ బ్యానర్స్ జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీతో అయినా గోపీచంద్ హిట్ కొడతాడో లేదో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…