Today Gold Rate : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. కొన్ని రోజుల పాటు స్థిరంగా కూడా ఉన్నాయి. అయితే తాజాగా బంగారం ధరలు మాత్రం షాకిచ్చాయని చెప్పవచ్చు. ఇన్ని రోజుల పాటు తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు శుక్రవారం పెరిగాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం కొనుగోళ్లు, అమ్మకాలు జరుపుతున్నారు. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,380గా ఉంది. అలాగే విజయవాడ, వైజాగ్‌లలోనూ రేట్లు ఇదే విధంగా ఉండడం విశేషం.
ఇక దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,380గా ఉంది. అలాగే కోల్‌కతాలో ఈ ధరలు రూ.47,100, రూ.51,380గా ఉన్నాయి. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇలాగే రేట్లు కొనసాగుతున్నాయి. చెన్నైలో మాత్రం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,670 ఉండగా,, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52వేలుగా ఉంది.

ఇక పూణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,130, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,410గా ఉన్నాయి. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా శుక్రవారం పెరిగాయి. కిలో వెండి ధర శుక్రవారం రూ.1900 పెరిగి రూ.56,500 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో అయితే కిలో వెండి ధర రూ.61,200గా ఉంది. కోల్‌కతాలో రూ.56,500, బెంగళూరులో రూ.61,200, ముంబై, చెన్నైలలో రూ.56,500, రూ.61,200గా ఉన్నాయి. అయితే కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ఈ ధరలు అకస్మాత్తుగా పెరగడంతో ఇది మహిళలకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.