Ravana : రాముడు రావణుడిని వధించాడు. రావణుడు చనిపోయే ముందు, రాముడికి చెప్పిన మాటలు ఇవి. రావణుడు తాను చనిపోయే ముందు రాముడికి ఈ విధంగా చెప్పుకొచ్చాడు. లంకాధిపతి రావణ బ్రహ్మ యుద్ధ భూమిలో మృత్యు శయ్యపై అవసాన దశలో శ్రీరాముడితో ఈ విధంగా మాట్లాడాడు. రామా నీ కంటే నేను అన్నింట్లో కూడా గొప్పవాడినే. నాది బ్రాహ్మణ జాతి. నీది ఏమో క్షత్రియ జాతి. నీకంటే వయసులో కూడా నేను పెద్దవాడిని. నీ కుటుంబం కంటే నా కుటుంబం చాలా పెద్దది.
నా వైభవం కూడా నీ వైభవం కంటే అధికమైనది. నీ అంతఃపురం స్వర్ణమైతే, నా లంకా నగరం అంతా కూడా స్వర్ణమయమే. బల పరాక్రమాల్లో కూడా నీ కంటే నేను శ్రేష్టుడిని. అయితే నీతో నేను చూసుకుంటే.. నీ కంటే అన్నింటిలో కూడా నేను ముందు ఉన్నాను. అయినా కూడా యుద్ధంలో నీ ముందు నేను ఓడిపోయాను. నీవే యుద్ధం గెలిచావు. దీనికి కారణం ఒకే ఒక్కటి.
అదేమిటి అంటే నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు. కానీ నా తమ్ముడు మాత్రం నా వద్ద లేడు. నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఆ కారణం చేతే నేను ఓడిపోయాను.. అని రావణుడు తాను చనిపోయే ముందు రాముడితో చెబుతాడు. దీన్ని బట్టి చూస్తే కుటుంబం దూరమైతే బతుకే భారం అయిపోతుంది. కుటుంబాన్ని విడిపోయి రావణుడు లాంటి వాడే ఓటమిపాలయ్యాడు. అలాంటిది రావణుడి ముందు మనమెంత..? అందుకే కలిసి ఉండాలి. కచ్చితంగా కలసి ఉండి విజయాన్ని అందుకోవాలి. కుటుంబాన్ని విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాలి.
కలిసి ఉంటే దేనినైనా సులభంగా సాధించచ్చు. ఎంతటి కష్టాన్నైనా మనం ఎదుర్కోవచ్చు. కలిసి ఉంటే ఒకరికొకరు తోడుగా ఉంటారు. కనుక దేనినైనా అధిగమించవచ్చు. అనవసరంగా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నలుగురితో ఉంటే దేనినైనా మనం దాటేయవచ్చు. ఓటమి కూడా ఎదురవ్వదు. గెలుపు మన సొంతమవుతుంది. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటే, విడిపోయి ఓటమిపాలవ్వరు. కలిసి గెలుస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…