Deepam : ప్రతి ఒక్క ఇంట్లో కూడా రోజూ దీపారాధన చేయాలి. దీపారాధన చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు కచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. మరి దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలను కచ్చితంగా పాటించాలి అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. రోజూ రెండు సార్లు దీపం పెట్టాలి. ఉదయం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేస్తే మంచిది. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ స్వరూపం. మనలో నిత్యం ఆత్మ జ్యోతి వెలుగుతుంటుంది.
దీపంలోనే దేవతలు అందరూ కూడా ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే మీరు వెలిగించిన చోట దైవశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు. దేవతలు అందరూ కూడా వస్తారు. ప్రత్యేకమైన నియమాలంటూ ఏమీ లేవు. ఉదయం స్నానం చేశాక దీపాన్ని వెలిగించవచ్చు. సాయంత్రం కూడా స్నానం చేసి దీపాన్ని వెలిగించాలి. మాంసాహారం తినే వారు కూడా ప్రతి రోజూ దీపారాధన చేయడానికి తలస్నానం చేయక్కర్లేదు. మామూలు స్నానం చేస్తే చాలు.
దీపం పెట్టే ప్రమిద బంగారంతో చేసింది కానీ వెండి, ఇత్తడి లేదంటే మట్టిదైనా కూడా ఫరవాలేదు. దీపపు ప్రమిదని ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు. అలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. దీపం పెట్టే ప్రమిద స్టీలు, ఇనుపది అయ్యి ఉండకూడదు. దీపం పెట్టడానికి ముందు ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉన్న తర్వాత మాత్రమే దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట నీటితో తుడవాలి. బియ్యపు పిండితో ముగ్గు వేసి, కొంచెం పసుపు, కుంకుమ చల్లి ఆ తర్వాత దీపం వెలిగించాలి. దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదు. అది అశుభ సూచికం. కనీసం రెండు వత్తులైనా సరే వెలిగించాలి. దీపారాధనకి ఆవు నెయ్యిని ఉపయోగించడం మంచిది.
లేదంటే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు. ఏ ఇంట అయితే రెండు పూటలా దీపం వెలుగుతుందో, ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. దుష్టశక్తులన్నీ పోయి ఆ ఇంట అంతా మంచే జరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు. దీపారాధన చేసే వారికి గ్రహ దోషాలు, పీడలు వంటివి ఉండవు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…