Lord Sri Krishna And Bhishma : పూర్వకాలంలో మన పెద్దలు ఎక్కువ ఏళ్ల పాటు జీవించే వారు. రాను రాను ఆయుర్దాయం తగ్గిపోతూ వస్తోంది. అప్పట్లో చాలా మంది 90 నుంచి 100 ఏళ్ల వరకు జీవించారు. తరువాత అది 70 నుంచి 80 కి తగ్గిపోయింది. ఇప్పుడు 60 నుంచి 70 ఏళ్లకు ఆయుర్దాయం పడిపోయింది. ఇది రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతుందని సైంటిస్టులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే మీకు తెలుసా..? ద్వాపర యుగంలో.. అంటే మహాభారత యుద్ధం సమయంలో.. ఆ కాలంలో ప్రజల వయస్సు చాలా ఎక్కువగా ఉండేదట. వారు సుమారుగా 150 నుంచి 200 ఏళ్ల వరకు జీవించేవారట. అవును, కొందరు నిపుణులు ఇదే విషయం చెబుతున్నారు.
అప్పట్లో ఒక వ్యక్తి సరాసరి ఆయుర్దాయం 120 నుంచి 150 ఏళ్లు ఉండేదట. ఇక మహాభారత యుద్ధం సమయంలో భీష్ముడి వయస్సు 170 ఏళ్లని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. కానీ కొందరు మాత్రం అప్పటికి ఆయన వయస్సు 150 ఏళ్లు అని చెబుతారు. ఇక అదే సమయంలో కృష్ణుడి వయస్సుపై కూడా ఇప్పటికీ చాలా మంది వాదోపవాదనలు చేస్తూనే ఉన్నారు. మహాభారత యుద్ధం సమయం నాటికి కృష్ణుడి వయస్సు సుమారుగా 56 ఏళ్లు ఉంటుందని కొందరు అంటారు. కాదు, ఆయన వయస్సు 83 ఏళ్లు అని కొందరు అంటారు.

అర్జునుడి వయస్సు ఎంతంటే..?
ఇక కృష్ణుడు తన 119వ ఏట అవతారం చాలించాడని చెబుతారు. అలాగే మహాభారత యుద్ధం జరిగే నాటికి అర్జునుడి వయస్సు సుమారుగా 55 ఏళ్లు అని పురాణాలు చెబుతున్నాయి. అయితే అప్పటికి, ఇప్పటికి సగటు మనిషి ఆయుర్దాయం చాలా వరకు గణనీయంగా తగ్గిపోయిందని చెప్పవచ్చు. అందుకు మనం పాటిస్తున్న అలవాట్లే కారణం అని చెప్పవచ్చు. అప్పట్లో వారు ఎంతో నిష్టగా ఉండేవారు. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ విషయంలో కఠినమైన నియమాలను పాటించేవారు. ఇక భీష్ముడు అయితే తండ్రి కోరిక మేరకు జీవితాంతం పెళ్లి చేసుకోనని కఠిన బ్రహ్మచర్యం పాటించాడు. అందుకనే ఆయన 150 ఏళ్లకు పైగా జీవించాడని చెబుతారు.
వారి అలవాట్లనే మనమూ పాటించాలి..
అయితే అప్పట్లో వారు పాటించిన అలవాట్లను గనుక మనం కూడా పాటిస్తే వారిలాగే మనం కూడా మన ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కచ్చితమైన ఆహారపు అలవాట్లను పాటించడంతోపాటు రోజూ ఎంతో కొంత శారీరక శ్రమ చేయడం, తగినన్ని గంటల పాటు నిద్రించడం, పౌష్టికాహారం తీసుకోవడం, తగినన్ని నీళ్లను తాగడం వంటి నియమాలను పాటిస్తే మన ఆయుర్దాయం పెరుగుతుందని చెబుతున్నారు. అయితే మరి ఇవన్నీ ఇప్పటి ప్రజలకు సాధ్యమయ్యేవిలా మాత్రం కనిపించడం లేదు. కానీ ఎవరైనా ఇలాంటి జీవనవిధానాన్ని అలవాటు చేసుకుంటే వారు ఆరోగ్యవంతులుగా నిండు నూరేళ్లు జీవించవచ్చు. లేదంటే అనారోగ్యాల బారిన పడి త్వరగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి.