mythology

Arjuna : అర్జునుడి గురించి మీకు తెలియ‌ని ర‌హ‌స్యాలు ఇవే..!

Arjuna : అర్జునుడి గురించి తెలియని వారు ఉండరు. చాలామందికి అర్జునుడి గురించి కొన్ని విషయాలైనా తెలిసే ఉంటాయి. అయితే అర్జునుడి గురించి చాలామందికి తెలియని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృష్ణుడు, అర్జునుడు బంధువులే కాదు. కృష్ణుడు, అర్జునుడు మంచి స్నేహితులు కూడా. వీళ్ళిద్దరూ కలిసి గొప్ప విజయాలని అందుకున్నారు. కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం అప్పుడు అర్జునుడికి సారథిగా ఉండడమే కాకుండా అనేక సందర్భాలలో మరణం నుండి అర్జునుడిని కాపాడాడు.

కలకాలం వీళ్ళ మధ్య స్నేహం కొనసాగింది. అప్పట్లో చాలామంది స్త్రీలు వాళ్ళ హృదయాన్ని అర్జునుడికి అర్పించారు. కానీ ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. ద్రౌపది, సుభద్ర, చిత్రాంగద‌, ఉలూపి మాత్రమే అతనిని పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్లే అదృష్ట స్త్రీలు. సర్ప యువరాణి ఉలూపి అర్జునుడిని ప్రేమిస్తుంది. కానీ సర్ప యువరాజు అశ్వసేనకి నచ్చలేదు. చంపడానికి ప్రయత్నిస్తాడు. నరకపు జ్వాలల నుండి ఉలూపి అర్జునుడిని కాపాడడం, తర్వాత ఆమె తన జీవితాన్ని అర్జునుడికి ఇవ్వ‌డం జ‌రిగిపోతాయి.

Arjuna

రామేశ్వరం దర్శించి అక్కడ రాముడు వానరులతో కలిసి లంకకు నిర్మించిన వారధిని చూసి.. ఈ వారధి నిర్మించుటకు ఇంత కష్టం ఏల..? నేను ఈ వారధిని నిమిషంలో నిర్మించగలనని అర్జునుడు అంటాడు. ఓ కోతి పిల్ల నీవు నిర్మించు. నేను దానిమీద నిలబడతాను. అలా నిర్మించిన వారధి పడిపోకుండా ఉంటే, నేను నీకు బానిసత్వము చేసెదను. పడిపోయి ఉంటే నీవు నాకు చేయాలి.. అంటుంది. అర్జునుడు పరిహాసముగా వెంటనే వారధిని నిర్మించగా, ఆ కోతి పిల్ల అడుగు వేయగానే వారధి కూలిపోయింది. మళ్లీ నిర్మిస్తే, మళ్లీ కోతి పిల్ల విరగ్గొడుతుంది.

అర్జునుడు ఓడిపోయానని ఒప్పుకుని ఆ కోతికి బానిసత్వము చేయబోవుటకై సంసిద్ధుడు కాగా ఓ బ్రాహ్మణ బాలుడు అక్కడికి వచ్చి, విషయం గ్రహించి మధ్యవర్తిత్వము లేని పందెం న్యాయబద్ధం కాదని, నేను మధ్యవర్తిగా వుంటాను. మీరు మరలా పందెం కొనసాగించాల‌ని కోరుతాడు. అందుకు ఇద్దరూ సమ్మతించుగా అర్జునుడు వారధిని నిర్మిస్తాడు. ఆ వానరుడు తన శరీరమును ఎంత పెంచినా అది విరగలేదు. అర్జునుడు, ఆ కోతి ఆశ్చర్యపోయారు. ఆ బ్రాహ్మణ‌ బాలుడు శ్రీకృష్ణుడని, ఆ వానరం ఆంజనేయుడని అర్జునుడు గ్రహిస్తాడు. శ్రీకృష్ణుని కోరిక మేరకు అర్జునుడి రథం జెండాపై ఆంజనేయుడు ఉండడానికి అంగీకరిస్తాడు. ఈ తీర్థయాత్ర సమయంలోనే అర్జునుడు ద్వారకకు వెళ్లి సుభద్రని పెళ్లి చేసుకుంటాడు. వారికి అభిమన్యుడు పుడ‌తాడు.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM