lifestyle

Print Currency : ప్ర‌భుత్వాలు క‌రెన్సీని ముద్రించి అంద‌రికీ పంచ‌వ‌చ్చు క‌దా..? అలా ఎందుకు చేయ‌రు..?

Print Currency : గుండు సూది ద‌గ్గర్నుంచి.. విమానం దాకా.. నిరుపేద‌ల నుంచి ధ‌నికుల దాకా.. అంద‌రిని న‌డిపిస్తుందీ.. అందరికీ కావ‌ల్సిందీ.. ఒక్క‌టే.. డ‌బ్బు.. డ‌బ్బు లేనిదే ఈ ప్ర‌పంచంలో ఏ ప‌నీ కాదు. మ‌నిషి డ‌బ్బు కోసం ఏ ప‌నైనా చేస్తాడు. పేద‌వాడు ఒక్క పూట తిండి కోసం డబ్బు సంపాదించాల‌ని చూస్తాడు. ధ‌నికులు ఖ‌జానాల్లో ఉన్న త‌మ ధ‌నం రెట్టింపు కావాల‌ని చూస్తుంటారు. అయితే.. ప్ర‌పంచంలోని దేశాల‌న్నీ.. త‌మ‌కు కావ‌ల్సినంత క‌రెన్సీని ప్రింట్ చేసుకుని.. పేద‌లంద‌రికీ పంచ‌వ‌చ్చు క‌దా.. అప్పుడు పేద‌లంటూ ఉండ‌రు క‌దా.. ఈ క‌ష్టాలు, క‌న్నీళ్లు ఉండ‌వు క‌దా.. అని కొంద‌రు ఆలోచిస్తుంటారు. ప్ర‌భుత్వాలు అలా ఎందుకు చేయ‌వు..? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తుంటారు. అయితే అందుకు స‌మాధానాన్ని ఇక్క‌డ తెలుసుకుందాం.

సాధార‌ణంగా ఏ దేశ‌మైనా స‌రే.. క‌రెన్సీ ముద్ర‌ణ‌లో కొన్ని పాల‌సీల‌ను ఏర్పాటు చేసుకుంటాయి. ఇక మ‌న దేశం కూడా అంతే.. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మ‌న దేశంలో ఎంత న‌గ‌దు ఉందీ, ఎంత ముద్రించాలి.. అన్న వివ‌రాల‌ను ఎప్ప‌టికప్పుడు ప‌రిశీలిస్తూ.. కరెన్సీని ముద్రించి చెలామ‌ణీలోకి తెస్తుంది. మ‌న దేశంలో ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న మొత్తం బంగారు నిల్వ‌ల ఆధారంగా క‌రెన్సీ ముద్ర‌ణ అనేది జ‌రుగుతుంది. ఇక ఇత‌ర దేశాల వారు కూడా త‌మ పాల‌సీల ప్ర‌కారం క‌రెన్సీని ముద్రిస్తుంటారు. కానీ ఎవ‌రూ.. అతిగా క‌రెన్సీని ముద్రించ‌రు. ఎందుకంటే..

Print Currency

ఉదాహ‌ర‌ణ‌కు మ‌న దేశంలో పెద్ద ఎత్తున క‌రెన్సీని ముద్రించి అంద‌రికీ కొన్ని ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఇచ్చార‌నుకుందాం.. అప్పుడేమ‌వుతుంది. అంద‌రూ.. ధ‌నికులు అవుతారు.. స‌హ‌జంగానే జ‌నాల్లో ప‌నిచేసే త‌త్వం పోతుంది. ఆహార‌, వ‌స్తువుల ఉత్ప‌త్తి తగ్గుతుంది. డిమాండ్ పెరుగుతుంది. ధ‌ర‌లు పెరుగుతాయి. అలా కొంత కాలం న‌డుస్తుంది.. ఆ త‌రువాత ఆహారం దొర‌క‌దు. ఒక్క తిండి గింజ కోసం త‌న్నుకునే రోజులు వ‌స్తాయి.. ఇది అస‌లు ఏమాత్రం మంచిది కాదు. గ‌తంలో జింబాబ్వే కూడా స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంది. అక్క‌డ అవ‌స‌రం లేకున్నా పెద్ద ఎత్తున క‌రెన్సీని ముద్రించారు. ఉత్పత్తి త‌గ్గింది. ద్రవ్యోల్బ‌ణం పెరిగింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్య‌వస్థ కుప్ప‌కూలింది.

అలాగే ఏ దేశంలో అయినా స‌రే.. అవ‌స‌రానికి మించి క‌రెన్సీని ముద్రించి చెలామ‌ణీ చేస్తే.. జింబాబ్వేలో జ‌రిగిన‌ట్లే ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి. ఉత్ప‌త్తి త‌గ్గి అన్నింటి ధ‌ర‌లు పెరుగుతాయి. అప్పుడు రూ.10 ఉండే బియ్యం ధ‌ర ఏకంగా రూ.100 అవుతుంది.. దీంతో ప్ర‌జ‌ల వ‌ద్ద ఉన్న సంప‌ద వ‌స్తువుల‌ను కొనుగోలు చేసే కొద్దీ త‌రిగిపోతుంది.. అప్పుడు ప్ర‌జ‌లంద‌రూ మునుప‌టి క‌న్నా ఇంకా పేద‌రికంలోకి వెళ్లిపోతారు. అలాంట‌ప్పుడు కరెన్సీని ఎక్కువ‌గా ముద్రించి.. అంద‌రికీ పంచాల్సిన అవ‌స‌రం లేదు క‌దా.. అందుక‌నే ప్ర‌భుత్వాలు ఆ ప‌ని చేయ‌డం లేదు.. చేయ‌వు కూడా.. అది ప్ర‌జ‌ల‌కే కాదు, దేశ భ‌విష్య‌త్తుకూ అనర్థ‌దాయ‌కం.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM