Fridge : ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు అవి తాజాగా ఉండేందుకు మనం వాటిని ఫ్రిజ్‌లలో నిల్వ చేస్తుంటాం. కూరగాయలు, ఇతర ఆహారాలను మనం ఫ్రిజ్‌లలో పెడుతుంటాం. అయితే కొందరు అవసరం లేకున్నా ఒకేసారి పెద్ద ఎత్తున కూరగాయలను, ఇతర ఆహారాలను కొని వాటిని ఫ్రిజ్‌లలో స్టోర్ చేస్తున్నారు. అయితే అంత వరకు ఓకే.. కానీ కొన్ని రకాల ఆహారాలను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఫ్రిజ్‌లలో స్టోర్ చేయరాదు. మరి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా. పెరుగు, మజ్జిగ తప్ప.. పాలు, పాల సంబంధ ఇతర పదార్థాలు ఏవైనా సరే.. వాటిని ఫ్రిజ్‌లలో నిల్వ చేయరాదు. అవి వాటి సహజత్వాన్ని కోల్పోతాయి. అలాగే కోడిగుడ్లను కూడా ఎప్పటికప్పుడు తెచ్చుకుని వాడాలి. కానీ స్టోర్ చేయకూడదు. వేయించిన పదార్థాలను కూడా అప్పటికప్పుడే తినాలి. వాటిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి తమ రుచిని కోల్పోతాయి. అలాగే మునుపటికన్నా అవి మెత్తగా తయారవుతాయి. కనుక వీటిని ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచరాదు.
నూడుల్స్, పాస్తా వంటి వాటిని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని తినాలి. వాటిని ఫ్రిజ్‌లలో ఉంచరాదు. ఉంచితే చల్లదనం పోయాక.. అవి అంతకు ముందున్న స్థితిని కోల్పోతాయి. మరింత మెత్తగా మారుతాయి. కనుక వీటిని కూడా ఫ్రిజ్‌లలో స్టోర్ చేయకపోవడమే ఉత్తమం. కీరదోసలను చాలా మంది వేసవిలో ఎక్కువగా తింటుంటారు. వీటిని ముక్కలుగా కట్ చేసి కళ్లపై పెట్టుకుంటారు. అయితే అలాంటి పనికోసం కీర దోస ముక్కలను ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. కానీ తినే ఉద్దేశం ఉంటే వాటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. వాటి రుచిని కోల్పోతాయి. చాలా మంది పండ్లను ఫ్రిజ్‌లలో పెడుతుంటారు. అలా చేయాల్సిన అవసరం లేదు. పండ్లను ఎప్పటికప్పుడు కొని తెచ్చుకుని తింటేనే మంచిది. ఫ్రిజ్‌లలో పెట్టడం వల్ల అవి తమ సహజత్వాన్ని కోల్పోతాయి. రుచి ఉండదు.
కొందరు కాఫీ బీన్స్ లేదా గ్రౌండ్ కాఫీని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అలా చేయడం వల్ల ఫ్రిజ్ మొత్తం కాఫీ వాసన వస్తుంది. వాటిని ఫ్రిజ్‌లలో పెట్టకపోవడమే మంచిది. అయితే ఓపెన్ చేయని కాఫీ బీన్స్‌ను మాత్రం ఫ్రిజ్‌లో పెట్టవచ్చు. అది కూడా 1, 2 వారాలు మాత్రమే ఉండేట్లు చూడాలి. కొందరు టమాటా సాస్‌ను ఫ్రిజ్‌లో పెడతారు. అలా చేయడం వల్ల సాస్ చల్లదనం కోల్పోయాక అందులో ఉండే నీరు, వెనిగర్, టమాటా పేస్ట్ వేర్వేరు అవుతుంది. అలాగే సాస్ రుచి మారుతుంది. అంతకు ముందు ఉన్న స్థితి పోయి.. నాసిరకమైన స్థితిలో కనిపిస్తుంది. కనుక టమాటా సాస్‌ను ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…