Ulli Vada : ఉల్లిపాయలను వంటల్లో వాడడంతో పాటు వీటితో మనం రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. ఉల్లిపాయలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో ఉల్లి వడ కూడా ఒకటి. ఉల్లి వడలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి ఎక్కువగా హోటల్స్ లో లభిస్తూ ఉంటాయి. టీ టైం స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ ఉల్లి వడలను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే హోటల్ స్టైల్ ఉల్లి వడలన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లి వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 4 లేదా 5, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, వంటసోడా – చిటికెడు, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఉల్లి వడ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి. తరువాత ఉప్పు వేసి చేత్తో బాగా కలపాలి. వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఇందులో ఎక్కువగా ఉండే నీటిని తీసేసి ఉల్లిపాయ ముక్కలను మరో గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తురుము, జీలకర్ర, వంటసోడా వేసి బాగా కలపాలి. తరువాత బియ్యంపిండి, మైదాపిండి వేసి నీళ్లు పోయకుండా అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేతులకు నూనె రాసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వడలాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లి వడ తయారవుతుంది. దీనిని టమాట కిచప్ తో తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా హోటల్ స్టైల్ లో చేసిన ఈ ఉల్లివడలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…