lifestyle

Lemon Pepper Rasam Rice : అన్నాన్ని 10 నిమిషాల్లో ఇలా చేసి బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌లో తినండి.. ఎంతో బాగుంటుంది..!

Lemon Pepper Rasam Rice : ర‌సం రైస్.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. ర‌సం రైస్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. అలాగే త‌రుచూగా దీనిని ఇంట్లో త‌యారు చేస్తూ ఉంటారు కూడా. ఈ ర‌సం రైస్ ను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేసే లెమ‌న్ పెప్ప‌ర్ ర‌సం రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా దీనిని తీసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు దీనిని చాలా సుల‌భంగా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. అలాగే బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా ఈ ర‌సం రైస్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు దీనిని సుల‌భంగా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. పుల్ల పుల్ల‌గా, ఘాటుగా, క‌మ్మ‌గా ఉండే ఈ లెమ‌న్ పెప్ప‌ర్ ర‌సం రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

లెమ‌న్ పెప్ప‌ర్ ర‌సం రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – ఒక క‌ప్పు, కందిప‌ప్పు లేదా పెస‌ర‌ప‌ప్పు – 4 టేబుల్ స్పూన్స్, త‌రిగిన టమాటాలు – 2, ప‌సుపు – అర టీ స్పూన్, నీళ్లు – 3 క‌ప్పులు, మిరియాలు – అర టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ర‌సం పొడి – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు – గుప్పెడు, ఆవాలు – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు – 8, ఇంగువ – అర టీ స్పూన్, వేడి నీళ్లు – 600 ఎమ్ ఎల్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మ‌ర‌సం – ఒక‌టిన్న‌ర చెక్క‌.

Lemon Pepper Rasam Rice

లెమ‌న్ పెప్ప‌ర్ ర‌సం రైస్ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో బియ్యం, కందిప‌ప్పు తీసుకుని శుభ్రంగా క‌డిగి నీళ్లు పోసి గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఈ బియ్యాన్ని కుక్క‌ర్ లో వేసుకోవాలి. ఇందులో నీళ్లు, ప‌సుపు, ట‌మాట ముక్క‌లు వేసి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 4 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మిరియాలు, జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా బ‌రక‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో ర‌సం పొడిని తీసుకోవాలి. ఇందులో 4 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ఉండలు లేకుండా క‌లుపుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక జీడిప‌ప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నెయ్యిలో ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, ఇంగువ‌, దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు వేసి వేయించాలి.

త‌రువాత ఉడికించిన అన్నాన్ని మెత్త‌గా చేసి వేసుకోవాలి. ఇందులో వేడి నీళ్లు పోసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత ఉప్పు, కొత్తిమీర‌, నీటిలో క‌లిపిన ర‌సం పొడి వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మిరియాల పొడి వేసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 10 నుండి 12 నిమిషాల పాటు మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత నిమ్మ‌ర‌సం, కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత పైన వేయించిన జీడిప‌ప్పు వేసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే లెమ‌న్ పెప్ప‌ర్ ర‌సం రైస్ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts

How To Increase Breast Milk : ఈ ఆహారాల‌ను తింటే చాలు.. బాలింత‌ల్లో స‌హ‌జ‌సిద్ధంగా పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి..!

How To Increase Breast Milk : గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌లు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న సంగ‌తి తెలిసిందే. కాస్త…

Saturday, 18 May 2024, 8:47 PM

Telugu OTT : ఈ వారం ఓటీటీల్లో 7 సినిమాలు.. వాటిల్లో 4 బాగా స్పెష‌ల్‌.. స్ట్రీమింగ్ వేటిలో అంటే..?

Telugu OTT : వారం వారం ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలో…

Saturday, 18 May 2024, 6:18 PM

Eggs In Summer : వేస‌విలో కోడిగుడ్ల‌ను తిన‌డం మంచిది కాదా..?

Eggs In Summer : గుడ్డు ఒక ఆరోగ్యకరమైన మరియు సూపర్ ఫుడ్. ఎందుకంటే విటమిన్ బి12, బి6, బి5,…

Saturday, 18 May 2024, 11:42 AM

Lemon Buying : నిమ్మ‌కాయ‌ల‌ను కొంటున్నారా.. అయితే ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Lemon Buying : నిమ్మకాయల‌ను భారతీయులు ఇంట్లో మరియు వంటగదిలో అనేక రకాలుగా ఉపయోగిస్తారు. రుచిలో పుల్లగా ఉండే నిమ్మకాయలు…

Saturday, 18 May 2024, 9:04 AM

Hibiscus Tea : మందార పువ్వుల టీని రోజూ తాగితే.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

Hibiscus Tea : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో ఎన్నో ర‌కాల మొక్క‌లు క‌నిపిస్తుంటాయి. వాటిల్లో కొన్ని అంద‌మైన పుష్పాలు పూస్తాయి.…

Friday, 17 May 2024, 7:53 PM

Whiten Teeth : ఈ నాచుర‌ల్ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ దంతాలు తెల్ల‌గా మెరిసిపోతాయి..!

Whiten Teeth : మ‌న శ‌రీరంలోని అవ‌య‌వాల్లో దంతాలు కూడా ఒక‌టి. చాలా మంది వీటి ఆరోగ్యంపై దృష్టి పెట్ట‌రు.…

Friday, 17 May 2024, 6:17 PM

Sitting In Temple : ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా కాసేపు అందులో కూర్చోవాలి.. ఎందుకంటే..?

Sitting In Temple : మన దేశంలో ప్రతి ఇంట్లోనూ దేవుడికి చిన్నపాటి గుడి అయినా కచ్చితంగా ఉంటుంది. ఇల్లు…

Friday, 17 May 2024, 3:11 PM

Work From Home Scam : వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ స్కామ్‌.. 4 రోజుల్లో రూ.54 ల‌క్ష‌లు పోగొట్టుకున్న మ‌హిళ‌..

Work From Home Scam : సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప్ర‌స్తుత త‌రుణంలో ఎంత‌గా ఉందో అంద‌రికీ తెలిసిందే. అయితే…

Friday, 17 May 2024, 11:30 AM