Tea Powder : ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ అయిన ఆహార పదార్థాలే మనకు లభిస్తున్నాయి. ఆహార పదార్థాల కల్తీ అనేది నేటి తరుణంలో సర్వ సాధారణం అయిపోయింది. ఈ క్రమంలో అసలు పదార్థాలను గుర్తించడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా మనం నిత్యం సేవించే టీ పొడిని కూడా ఇప్పుడు కల్తీ చేస్తున్నారు. అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే మీరు వాడుతున్న టీ పొడి కల్తీ అయిందా, లేదా అన్నది సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
1. కొన్ని తేయాకులను తీసుకుని ఫిల్టర్ పేపర్ లేదా బ్లాటింగ్ పేపర్‌పై వేసి నీళ్లు చల్లాలి. అనంతరం ఆకులను తీసేసి ఆ పేపర్‌ను ట్యాప్ వాటర్‌తో కడగాలి. పేపర్‌పై ఎలాంటి మరకలు పడకపోతే ఆ తేయాకులు కల్తీ జరగలేదని గుర్తించాలి. అదే కల్తీ జరిగితే పేపర్‌పై కోల్ తార్ మరకలు కనిపిస్తాయి.
2. టీ పొడి లేదా ఆకులను ఒక గ్లాస్ ప్లేట్‌పై వేసి వాటిపై అయస్కాంతం ఉంచాలి. ఒక వేళ ఆ పొడి లేదా ఆకుల్లో ఐరన్ ఉంటే వెంటనే అయస్కాంతానికి ఆ ఐరన్ అంటుకుంటుంది. దీంతో ఆ టీ పొడి కల్తీ జరిగిందని గుర్తించాలి.
3. ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో టీ పొడి లేదా తేయాకులు కొన్నింటిని వేయాలి. అవి కల్తీవైతే నీళ్ల రంగు మారుతుంది. అసలువైతే నీళ్లు అలాగే ఉంటాయి. రంగు మారవు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…