Cooking Oil Reheat : నిత్యం మనం వండుకునే అనేక రకాల కూరల్లో కచ్చితంగా నూనె పడాల్సిందే. నూనె లేకపోతే ఏ కూరను వండుకోలేం. కూరలు రుచిగా ఉండవు. ఇక మనకు మార్కెట్‌లో అనేక రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు తమ స్థోమత, అభిరుచులకు తగిన విధంగా వంట నూనెలను కొనుగోలు చేసి వాడుతుంటారు. అయితే చాలా మంది వంట నూనెలను పదే పదే వేడి చేసి మరీ ఉపయోగిస్తుంటారు. నిజానికి అలా చేయడం మంచిది కాదు. దాంతో ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* వంట నూనెలను పదే పదే వేడి చేసి ఉపయోగించడం వల్ల వాటిల్లో కార్సినోజెన్లు అనబడే పదార్థాలు ఉత్పన్నమవుతాయి. ఇవి విషంతో సమానం. ఈ క్రమంలో అలాంటి నూనెను ఉపయోగించడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. అలాగే స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు శరీరం ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది.
* పదే పదే వేడి చేసిన వంట నూనెను ఉపయోగించడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
* ఎక్కువ సార్లు వేడి చేయబడిన వంట నూనెతో అసిడిటీ సమస్య వస్తుంది. శరీర జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.
* చాలా సార్లు వేడి చేసిన నూనెను ఉపయోగిస్తే క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుందని పలువురు సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. కనుక ఏ వంట నూనె అయినా సరే కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలని పరిశోధకులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…