Pregnant Women Diet : గర్భం దాల్చిన మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. డాక్టర్ సూచన మేరకు ఏయే ఆహార పదార్థాలను తినమని చెబుతారో వాటినే తినాలి. అంతేకానీ.. తెలిసీ తెలియకుండా ఏది పడిదే ఆ ఆహారాన్ని తినకూడదు. ముఖ్యంగా రెడీ టు ఈట్ ఫుడ్‌ను గర్భిణీలు అస్సలు తినకూడదట. తింటే అనేక దుష్పరిణామాలు ఎదురవుతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. రెడీ టు ఈట్ ఫుడ్‌ను గర్భిణీలు తింటే పుట్టబోయే పిల్లలపై ఆ ఫుడ్ ప్రభావాన్ని చూపిస్తుందట.
రెడీ టు ఈట్ ఫుడ్ అంటే.. నిల్వ చేసిన ఆహార పదార్థాలు అన్నమాట. వాటిని వండాల్సిన పని ఉండదు. నేరుగా తినేయడమే. ప్రస్తుతం మనకు మార్కెట్‌లో అనేక రకాల రెడీ టు ఈట్ ఫుడ్ ఐటమ్స్ లభిస్తున్నాయి. అయితే వీటికి గర్భిణీలు ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెడీ టు ఈట్ ఫుడ్‌ను గర్భిణీలు తింటే వారికి పుట్టబోయే పిల్లలు అనారోగ్య సమస్యలతో పుడతారట. అంతేకాకుండా ఆ ఫుడ్ మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని, దీంతో వారికి సంతానం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.
రెడీ టు ఈట్ ఫుడ్‌ను తినడం వల్ల గర్భిణీలకు కొన్ని సందర్భాల్లో అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే మహిళలకు పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనే సమస్య వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. కనుక గర్భం దాల్చిన మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాల పోషకాలు కలిగిన పండ్లు, తాజా కూరగాయలను బాగా తింటే.. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…