Keto Diet : అధిక బరువును తగ్గించుకోవచ్చని, డయాబెటిస్ నయం అవుతుందని చెప్పి కీటో డైట్‌ను ఎక్కువగా ఫాలో అవుతున్నారా ? అయితే జాగ్రత్త. ఎందుకంటే.. కీటో డైట్ వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయట. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. పలువురు సైంటిస్టులు తాజాగా చేపట్టిన పరిశోధనల్లో తెలిసింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కీటో డైట్‌ను ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ డైట్‌పై అధ్యయనాలు చేసిన సైంటిస్టులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అదేమిటంటే..
కీటో డైట్‌లో కార్బొహైడ్రేట్లను తక్కువగా, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారని తెలిసిందే. అయితే ఇలాంటి డైట్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనంలో తేలింది. కాగా ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ డైట్‌ను అనుసరిస్తున్నారు. అయితే కీటో డైట్ వల్ల గుండెకు ముప్పు పొంచి ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కార్బొహైడ్రేట్లను తగ్గించి తినడం మంచిది కాదని వారు తెలియజేస్తున్నారు.
కీటో డైట్‌లో భాగంగా కార్బొహైడ్రేట్లను తగ్గించి తింటే గుండె జబ్బులు వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. కీటో డైట్ వల్ల గుండె కొట్టుకునే వేగం లయ తప్పుతుందని, గుండె కొట్టుకునే రేటు అసాధారణంగా ఉంటుందని, దీని వల్ల గుండె పోటు వచ్చేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే ఇతర గుండె సమస్యలు కూడా వస్తాయని వారు అంటున్నారు. కాగా కీటో డైట్‌ను తీసుకుంటున్న 14వేల మందిపై పరిశోధనలు చేయగా ఈ విషయం వెల్లడైందని ప్రముఖ సైంటిస్టు, కార్డియాలజిస్టు డాక్టర్ జుంగ్ తెలిపారు. కనుక కీటో డైట్‌ను ఫాలో అయ్యే వారు ఇకనైనా ఈ డైట్ విషయంలో జాగ్రత్త వహిస్తే మంచిది. లేదంటే గుండె జబ్బుల బారిన పడేందుకు అవకాశం ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…