Pericardial Effusion : మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో గుండె కూడా ఒకటి. ఇది రక్తాన్ని పంపు చేస్తుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోతే మనిషి చనిపోతాడు. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మీరు కచ్చితంగా గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. తీసుకునే డైట్‌పై శ్రద్ధ పెట్టాలి. మీరు మీ జీవన విధానం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది. అయితే గుండెలో కొన్ని సార్లు నీరు చేరుతుంది. ఈ విధంగా జరిగితే కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు మీకు మేము చెప్పబోతున్నాం. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వస్తే దీన్ని వైద్య పరిభాషలో Pericardial Effusion అంటారు. అంటే గుండెలో నీరు చేరడం అన్నమాట.
Pericardial Effusion సమస్య వచ్చిందంటే అది ఒక సీరియస్ ప్రాబ్లం అని గుర్తించాలి. దీని వల్ల గుండె చుట్టూ ఉండే ప్రాంతంలో నీరు చేరుతుంది. అయితే ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇన్‌ఫెక్షన్లు, గాయం అవడం, ఇతర వ్యాధులు కూడా ఇందుకు కారణాలు కావచ్చు. ఈ క్రమంలోనే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏర్పడే లక్షణాలను త్వరగా గుర్తించాల్సి ఉంటుంది. గుండె చుట్టూ ఉండే ప్రదేశంలో నీళ్లు చేరడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల గుండెకు రక్తాన్ని పంపు చేయడం చాలా ఇబ్బందిగా మారుతుంది. దీంతో రక్తసరఫరా కూడా ప్రభావితం అవుతుంది.
ఈ సందర్భంలో మన శరీరం మనకు పలు సంకేతాలను ఇస్తుంది. తీవ్రమైన ఛాతి లేదా గుండె నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం, ఛాతిపై బరువు పెట్టినట్లు అనిపించడం, గుండె కొట్టుకునే వేగం అకస్మాత్తుగా పెరగడం, తలనొప్పి, తలతిరగడం, కళ్లు తిరిగి పడిపోవడం, ఆహారం తినడంలో ఇబ్బంది ఎదురుకావడం, ఆందోళన, కంగారు వంటి లక్షణాలు కనిపిస్తే మీ గుండె చుట్టూ నీరు చేరిందని అర్థం చేసుకోవాలి. ఈ సమస్య వచ్చేందుకు పైన చెప్పిన కారణాలతోపాటు కొన్ని ఇతర అంశాలు కూడా కారణం అవుతుంటాయి.
ఇన్‌ఫెక్షన్లు, గుండె వద్ద గాయం కావడం, గుండె జబ్బులు ఉండడం, అస్తవ్యస్తమైన జీవన విధానం, ఆహారపు అలవాట్లు వంటి కారణాల వల్ల కూడా Pericardial Effusion సమస్య తలెత్తుతుంది. కొన్ని సార్లు వైరల్, బాక్టీరియల్, ప్రొటోజోవల్ ఇన్‌ఫెక్షన్లు కూడా కారణం అవుతుంటాయి. అలాగే క్యాన్సర్ కణాలు ఉండడం, థైరాయిడ్ ఆటోఇమ్యూన్ వ్యాధి ఉండడం, గుండెకు శస్త్ర చికిత్స జరిగి ఉండడం, హార్మోన్ సమస్యలు వంటివి కూడా ఈ స్థితికి కారణాలు అవుతుంటాయి. కనుక ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి. దీంతో సరైన టైములో పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవచ్చు. అప్పుడు ప్రాణాంతకం కాకుండా చూసుకోవచ్చు. దీంతో ముందుగానే ప్రాణాలను రక్షించుకున్నవారము అవుతాము. కాబట్టి ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…