Palu Kobbari Payasam : పుట్టిన రోజైనా.. ఏదైనా శుభవార్త విన్నా.. శుభకార్యం తలపెట్ట దలిచినా.. పెళ్లి రోజైనా.. మరే ఇతర శుభ దినమైనా సరే.. మన తెలుగు ఇండ్లలో మొదటగా గుర్తుకు వచ్చేది పాయసం. పెద్దగా కష్టపడాల్సిన పనిలేకుండానే తియ్య తియ్యని పాయసాన్ని చేసుకుని వేడి వేడిగా లాగించేయవచ్చు. ప్రతి శుభ సందర్భాన్ని మన వాళ్లు పాయసంతో మొదలు పెట్టి జరుపుకుంటారు. అయితే దాన్నే ఇంకాస్త రుచికరంగా చేసుకోవచ్చు. అదెలాగంటే..
పాలు, కొబ్బరి పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
తాజా కొబ్బరి తురుము – 1 కప్పు, చక్కెర – 3/4 కప్పు, పాలు – 1/2 కప్పు, బియ్యం – 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – 1/2 టీస్పూన్, నెయ్యి – 1 టీస్పూన్, బాదం పప్పు (తరిగినవి) – తగినన్ని.
పాలు, కొబ్బరి పాయసం తయారు చేసే విధానం..
ముందుగా బియ్యాన్ని 2 గంటల పాటు నానబెట్టాలి. తరువాత అందులో కొబ్బరి తురుం వేసి మెత్తగా పట్టుకోవాలి. ఒక గిన్నెలో ఈ మిశ్రమాన్ని తీసుకుని ఉడకబెట్టాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడే అందులో చక్కెర, పాలు పోసి బాగా కలపాలి. పాయసం చిక్కబడుతున్నప్పుడు అందులో యాలకుల పొడి, నేతిలో వేయించిన బాదం పప్పు వేసి దింపాలి. అంతే.. వేడి వేడి పాలు, కొబ్బరి పాయసం తయారవుతుంది. దీన్ని వేడిగా తింటే ఎంతో మజాగా ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…