Bananas : అరటి పండ్లను తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్ తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. మలబద్దకం లేకుండా చూస్తుంది. అలాగే ఎక్కువ సమయం పాటు ఆహారం తీసుకోకుండా ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది. అరటిపండు పేద, మధ్య తరగతి, ధనిక వర్గాలు.. అందరికీ అందుబాటులో ఉండే పండు.. దీని ధర కూడా ఇతర పండ్లతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుంది. అందుకనే దాదాపుగా ప్రతి ఇంట్లోనూ మనకు అరటి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ పండ్లు ఏడాది మొత్తం మనకు అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు వీటిని పండు రూపంలోనే తింటే.. కొందరు వీటితో మిల్క్‌షేక్‌లు, స్మూతీలు, డిజర్ట్స్, పాన్‌కేకులు చేసుకుని తింటుంటారు.
అయితే అరటి పండ్లను తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్ తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. మలబద్దకం లేకుండా చూస్తుంది. అలాగే ఎక్కువ సమయం పాటు ఆహారం తీసుకోకుండా ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది. ఇక అరటి పండ్లలో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. ఒక మీడియం సైజు అరటిపండులో 27 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 3 గ్రాముల ఫైబర్, 14 గ్రాముల సహజసిద్ధమైన చక్కెర ఉంటాయి. దీంతో మనకు 105 క్యాలరీల శక్తి లభిస్తుంది. అందుకనే చాలా మంది భోజనానికి, భోజనానికి మధ్యలో ఆకలి వేస్తే దాన్ని తట్టుకోవడానికి ఎక్కువగా అరటిపండ్లను తింటుంటారు.
ఇక రోజుకు గరిష్టంగా ఎన్ని అరటి పండ్లను తినొచ్చనే విషయానికి వస్తే యూఎస్‌డీఏ సూచనల ప్రకారం ఎలాంటి అనారోగ్య సమస్యా లేని ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు గరిష్టంగా రెండు పెద్ద అరటిపండ్లను తినవచ్చు. అదే మీడియం సైజ్ అయితే 3, చిన్నవి అయితే 5 అరటి పండ్ల వరకు తినొచ్చు. అదే డయాబెటిస్ ఉన్నవారు అయితే అరటి పండ్లను అస్సలు తినరాదు. ఎందుకంటే.. అరటిపండులో పెద్ద మొత్తంలో ఉండే కార్బొహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారి రక్తంలో వెంటనే కలుస్తాయి. అందువల్ల షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. దీంతో ఇబ్బందులు కలుగుతాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు అరటి పండ్లను తినకపోవడమే మంచిది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…