Mosquitoes : ప్రస్తుత తరుణంలో ఎక్కడ చూసినా విష జ్వరాల బారిన పడి జనాలు అల్లాడిపోతున్నారు. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ డబ్బులు నష్టపోవడమే కాక, ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. చాలా మందికి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాలు వస్తున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ జ్వరాలకు ముఖ్య కారణం.. దోమలు కుట్టడమే. దోమలు పలు వాసనలకు ఆకర్షితమై మన దగ్గరికి వచ్చి మనల్ని కుడతాయి. అందుకనే మనకు జ్వరాలు వస్తాయి. అయితే దోమలు రాకుండా వాటికి పడని వాసనలను వచ్చేట్లు చేస్తే.. వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు. మరి దోమలకు పడని వాసనలు ఏమిటో, అవి ఏయే వాసనలకు ఆకర్షితమవుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
వెల్లుల్లి వాసన దోమలకు పడదు. వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసన దోమలను తరిమి కొడుతుంది. వెల్లుల్లి రసం తీసి బాటిల్‌లో నింపి రూంలలో స్ప్రే చేస్తే ఆ వాసనకు దోమలు పరారవుతాయి. తులసి ఆకుల వాసన అన్నా దోమలకు పడదు. వాటి నుంచి తీసిన రసాన్ని నీటితో కలిపి స్ప్రే చేస్తే దోమలు రాకుండా ఉంటాయి. పుదీనా ఆకుల వాసన కూడా దోమలకు నచ్చదు. ఆ రసాన్ని కూడా మనం మస్కిటో రీపెల్లెంట్‌లా ఉపయోగించుకోవచ్చు. పుదీనా వాసనతో దోమలు పరారవుతాయి.
లెమన్ గ్రాస్ మొక్క ఆకుల రసం లేదా వేపాకుల రసం కూడా దోమలను తరిమికొట్టేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక మార్కెట్‌లో మనకు లభించే రసాయన మస్కిటో రీపెల్లెంట్‌లు పడవు అని భావించే వారు పైన తెలిపిన సహజ సిద్ధమైన చిట్కాలను పాటించి దోమలను తరిమి కొట్టవచ్చు. అయితే మనం వదిలే కార్బన్ డయాక్సైడ్, స్ప్రే చేసుకునే పర్‌ఫ్యూమ్‌లు, ఓ గ్రూప్ బ్లడ్ ఉన్నవారు, మన నుంచి వచ్చే చెమటకు కూడా దోమలు బాగా ఆకర్షితమవుతాయి. కనుక ఈ విషయాలను కూడా దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దోమలు మనల్ని కుట్టకుండా అప్రమత్తంగా ఉండవచ్చు. దాంతో విష జ్వరాలు రాకుండా ఉంటాయి..!
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…