Green Peas : పచ్చి బఠానీలను వాస్తవానికి చాలా మంది అప్పుడప్పుడు మాత్రమే తింటారు. వీటితో తీపి లేదా కారం వంటకాలను చేసి తింటారు. చిరుతిళ్లు, స్వీట్లు, మసాలా వంటకాల్లో మాత్రమే పచ్చి బఠానీలను వాడుతారు. కానీ వాస్తవానికి వీటిని రోజూ తినాలి. రోజూ కాసిన్ని పచ్చి బఠానీలను ఉడకబెట్టి పోపు వేసి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు, మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పచ్చి బఠానీలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చి బఠానీల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని పోషకాలకు గని అని చెప్పవచ్చు.
ఒక కప్పు పచ్చి బఠానీల్లో ప్రోటీన్లు 8 నుంచి 12 గ్రాముల మేర లభిస్తాయి. ప్రోటీన్లు మన శరీర నిర్మాణానికి, కండరాల పెరుగుదలకు, శక్తికి ఎంతో అవసరం. చికెన్, మటన్ వంటి నాన్‌వెజ్ ఆహారాలను తినలేని వారికి పచ్చి బఠానీలు గొప్ప వరం అని చెప్పవచ్చు. వీటితో శాకాహారులకు ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి వారికి ఎంతో మేలు చేస్తాయి. పచ్చి బఠానీలు షుగర్ పేషెంట్స్‌కు కూడా వరమనే చెప్పవచ్చు. వీటిని తింటే షుగర్ లెవల్స్ పెరగవు సరికదా.. ఇవి షుగర్‌ను తగ్గిస్తాయి. అలాగే అధిక బరువును కూడా ఇవి తగ్గించగలవు. శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి.
పచ్చి బఠానీలు గుండెకు చాలా మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రావు. అలాగే వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు క్యాన్సర్ దరి చేరకుండా చూస్తాయి. ఇలా పచ్చి బఠానీలు మనకు ఎంతో మేలు చేస్తాయి. కనుక రోజూ వీటిని తప్పనిసరిగా తినాల్సి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…