Arikela Kichdi : చిరుధాన్యాలలో ఒకటైన అరికెలతో మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అరికెలను తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. షుగర్, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. అయితే అరికెలను తినేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కారణం ఇవి అంతగా రుచిగా ఉండవు. కానీ వీటితో కిచిడీ తయారు చేసి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు, మనకు పోషకాలను సైతం అందిస్తుంది. దీన్ని మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌లోనూ తినవచ్చు. అందరూ ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే అరికెల కిచిడీ తయారీకి ఏమేం పదార్థాలు కావాలో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరికెలు – అరకప్పు, పెసర పప్ప – అర కప్పు, పచ్చి బఠానీ – అర కప్పు, ఉల్లిపాయ – 1, టమాటా – 1, అల్లం తరుగు – 1 టీస్పూన్, పచ్చిమిర్చి – 2, కరివేపాకు రెబ్బలు – 2, జీలకర్ర – అర టీస్పూన్, ఇంగువ – చిటికెడు, కారం – 1 టీస్పూన్, ఉప్పు – తగినంత, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, పసుపు – కొద్దిగా.
అరికెలు, పెసర పప్పును ఓ గిన్నెలో తీసుకుని గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్‌ని పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. అది వేడయ్యాక జీలకర్రం, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత పసుపు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, టమాటా తరుగు, పచ్చి బఠానీ వేసి బాగా కలిపి, కారం, తగినంత ఉప్పు, రెండు కప్పుల నీళ్లు పోసి అరికెలు, పెసర పప్పు వేసి మూత పెట్టి, ఒక విజల్ వచ్చే వరకు ఉంచి దింపేయాలి. తరువాత కిచిడీని బాగా కలిపి వడ్డించే ముందు మిగిలిన నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇలా క్షణాల్లోనే ఎంతో రుచికరమైన అరికెల కిచిడీ తయారు చేయవచ్చు. అరికెలతో ఏం చేయాలా.. అని ఆలోచించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీంతో ఒక వైపు రుచిని ఆస్వాదిస్తూనే మరోవైపు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…