lifestyle

Natural Hair Oil : ఈ నాచుర‌ల్ ఆయిల్‌ను ఇలా త‌యారు చేసి వాడితే.. తెల్ల‌గా ఉన్న మీ జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..!

Natural Hair Oil : పూర్వ‌కాలంలో మ‌న పెద్దల‌కు కేవ‌లం వ‌య‌స్సు పైబ‌డిన త‌రువాతే జుట్టు తెల్ల‌గా మారేది. అందుకు కార‌ణం వారిలో వ‌య‌స్సు పెరిగే కొద్దీ మెల‌నిన్ అనే వ‌ర్ణ ద్ర‌వ్యం త‌గ్గిపోవ‌డ‌మే. అందువ‌ల్లే వ‌య‌స్సు పైబ‌డే వారిలో జుట్టు తెల్ల‌బ‌డుతుంది. అయితే నేటి కాలంలో చాలా చిన్న వ‌యస్సులో ఉన్న‌వారు కూడా తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. వంశ‌పారంప‌ర్య‌త‌, హార్మోన్ల లోపం, పోష‌కాహార లోపం, ఒత్తిడి వంటి కార‌ణాల వ‌ల్ల చాలా మందికి జుట్టు తెల్ల‌బ‌డుతోంది. అయితే కింద చెప్పిన విధంగా ఓ ఆయిల్‌ను నాచుర‌ల్‌గా త‌యారు చేసి వాడితే దాంతో తెల్ల జుట్టు స‌హ‌జంగా న‌ల్ల‌బ‌డుతుంది. ఇక ఆయిల్‌కు ఏమేం ప‌దార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.

మార్కెట్‌లో మ‌న‌కు జుట్టును న‌ల్ల బ‌రిచేందుకు అనేక ర‌కాల ప్రొడ‌క్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి చాలా ఖ‌రీదు క‌ల‌వి అయి ఉంటాయి. అలాగే వాటిని ర‌సాయ‌నాల‌తో త‌యారు చేస్తారు. క‌నుక వాటిని దీర్ఘ‌కాలంలో వాడ‌డం అంత శ్రేయ‌స్క‌రం కాదు. అందువ‌ల్ల స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో త‌యారు చేసిన వాటిని వాడాలి. వాటిల్లో ఇప్పుడు చెప్ప‌బోయే ఆయిల్ ఒక‌టి. దీని త‌యారీకి క‌రివేపాకులు, న‌ల్ల నువ్వులు, ఉసిరి ముక్క‌లు, ప‌సుపు, గ‌సగ‌సాలు, వాల్ న‌ట్స్‌, బాదం ప‌ప్పు, ఆవ నూనె అవ‌స‌రం అవుతాయి. వీటిని కొద్ది కొద్దిగా తీసుకోవాలి.

Natural Hair Oil

స్ట‌వ్ ఆన్ చేసి పాత్ర పెట్టి అందులో ముందుగా ఆవ‌నూనె వేయాలి. నూనె కాగిన త‌రువాత అందులో మిగిలిన అన్ని ప‌దార్థాల‌ను వేసి నూనె రంగు మారే వ‌ర‌కు మ‌రిగించాలి. అనంత‌రం నూనెను వ‌డ‌క‌ట్టాలి. దాన్ని గాలి చొర‌బ‌డ‌ని సీసాలో నిల్వ చేయాలి. ఇక ఈ ఆయిల్‌ను వారంలో రెండు సార్లు వాడాలి. త‌ల‌కు బాగా అప్లై చేశాక 2 గంట‌లు ఆగి త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే మీ జుట్టు న‌ల్ల‌గా మార‌డ‌మే కాదు, పొడ‌వుగా పెరుగుతుంది. దృఢంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఇందులో వాడిన అన్ని ప‌దార్థాలు స‌హ‌జ‌సిద్ధ‌మైనవే, అందువ‌ల్ల మీ జుట్టుకు ఎలాంటి హాని క‌ల‌గ‌దు. దీంతో మీ జుట్టును చ‌క్క‌గా సంర‌క్షించుకోవ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM