lifestyle

Liver Detoxify : వీటిని తింటే చాలు.. మీ లివ‌ర్ పూర్తిగా క్లీన్ అయిపోతుంది..!

Liver Detoxify : మన శరీరంలోని అతి పెద్ద అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. మన శరీరానికి శక్తిని అందించేందుకు, విటమిన్లు, మినరల్స్‌ను నిల్వ చేసుకునేందుకు, విష పదార్థాలను బయటకు పంపేందుకు లివర్ ఎంతగానో శ్రమిస్తుంది. అయితే నిత్యం మనం అనుసరించే జీవనశైలితోపాటు పలు ఇతర కారణాల వల్ల కూడా లివర్‌లో కొన్ని సందర్భాల్లో విష పదార్థాలు పెరిగిపోతుంటాయి. దీంతో లివర్ సమస్యలు వస్తుంటాయి. అయితే అలా జరగకుండా ఉండాలంటే కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవాలి. దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటంటే..

కాఫీని ఎక్కువగా తాగితే అనారోగ్యకరమని వైద్యులు చెబుతుంటారు. అయితే కాఫీని నిత్యం తగినంత మోతాదులో తాగితే అది లివర్‌కు ఎంతో మేలు చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. కాఫీలో ఉండే ఔషధ గుణాలు లివర్ సమస్యలు రాకుండా చూడడంతోపాటు లివర్ క్యాన్సర్‌ను అడ్డుకుంటాయి. అందువల్ల నిత్యం కాఫీని తాగితే లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే లివర్‌లో ఉండే విష, వ్యర్థ పదార్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. దీంతో లివర్ శుభ్రంగా మారుతుంది.

Liver Detoxify

నిత్యం గ్రీన్ టీని సేవించడం వల్ల కూడా లివర్ శుభ్రంగా మారుతుందని, లివర్ సమస్యలు తగ్గుతాయని జపాన్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గ్రేప్‌ఫ్రూట్‌ను తినడం వల్ల కూడా లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. లివర్ క్లీన్ అవుతుంది. గ్రేప్‌ఫ్రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను సంరక్షిస్తాయి. బ్లూబెర్రీలు లేదా క్రాన్‌బెర్రీలను తినడం వల్ల కూడా లివర్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. వాటిల్లో ఉండే ఆంతోసయనిన్స్ అనబడే సమ్మేళనాలు లివర్‌ను సంరక్షిస్తాయి. లివర్‌ను శుభ్రంగా మారుస్తాయి.

నిత్యం ద్రాక్షలను తినడం వల్ల వాటిల్లో ఉండే రిస్వెరెట్రాల్ అనబడే సమ్మేళనం లివర్‌ను సంరక్షిస్తుంది. లివర్‌లోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. బీట్‌రూట్ జ్యూస్‌లో ఉండే నైట్రేట్లు, బీటాలెయిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. లివర్‌ను డ్యామేజ్ కాకుండా చూస్తాయి. అందువల్ల నిత్యం బీట్‌రూట్ జ్యూస్‌ను సేవిస్తుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. బాదం, పిస్తాపప్పు లాంటి నట్స్‌ను నిత్యం తింటే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ లివర్ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. లివర్‌ను శుభ్రం చేస్తాయి. చేపలు, ఆలివ్‌ఆయిల్‌లను తీసుకోవడం వల్ల వాటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్‌ను రక్షిస్తాయి. లివర్‌ను శుభ్రం చేస్తాయి.

Share
IDL Desk

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM