Multani Mitti : ముఖాన్ని కాంతివంతంగా మార్చడంతోపాటు పలు చర్మ సమస్యలను తగ్గించడంలో ముల్తానీ మట్టి అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల చర్మం మృదువుగా కూడా మారుతుంది. బ్లాక్ హెడ్స్, చర్మం రంగు మారడం, ఎండ వల్ల చర్మం కందిపోవడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఉన్నవారు ముల్తానీ మట్టిని ఉపయోగించాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి ముల్తానీ మట్టితో ఆయా సమస్యల నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందామా. ఒక గిన్నెలో రెండు మూడు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ చొప్పున పెరుగు, కీరదోస గుజ్జు, రెండు టీ స్పూన్ల శనగపిండిలను వేసి బాగా కలపాలి. తరువాత పాలు పోస్తూ మెత్తని మిశ్రమంగా చేయాలి. దాన్ని ముఖం, మెడకు రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. ప్రకాశిస్తుంది.
రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒకటిన్నర టీస్పూన్ల నిమ్మరసం, చిటికెడు పసుపులను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాల్లో మాస్క్‌లా రాయాలి. తరువాత బాగా ఆరిపోయాక తడి చేత్తో రుద్దుతూ మొత్తం కడిగేయాలి. దీంతో బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుతుంది. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీమట్టిలో అంతే మోతాదులో బంగాళాదుంపల గుజ్జును కలిపి ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. బాగా ఆరాక కడిగేయాలి. దీంతో ఎండ వల్ల రంగు మారిన చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుంది.
రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కొబ్బరి నీళ్లు, పావు టేబుల్ స్పూన్ చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో ఎండ వల్ల కందిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఒక గుడ్డు తెల్లసొనలో రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్టులా తయారు చేయాలి. దాన్ని ముఖానికి రాయాలి. అనంతరం 20 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో చర్మం దృఢంగా ఉంటుంది. సాగిపోయినట్లు కనిపించదు.
చర్మం పొడిబారిపోయే సమస్య ఉన్నవారు రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీమట్టిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని మాస్క్‌లా వేయాలి. 30 నిమిషాల నుంచి 60 నిమిషాల పాటు ఆగాక కడిగేయాలి. దీంతో చర్మం తేమగా మారుతుంది. మృదుత్వం వస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…