Iron Foods : మన శరీరానికి కావల్సిన అనేక ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. ఐరన్ మన శరీరంలో అనేక విధులు నిర్వర్తిస్తుంది. ఇది హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయ పడుతుంది. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ శరీరంలోని కణాలకు చేరేందుకు ఉపయోగపడుతుంది. దీని వల్ల శరీరంలో శక్తి స్థాయిలు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటాయి. అలాగే రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అయితే తగినంతగా ఐరన్ లేకపోతే మన శరీరం ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను తయారు చేయలేదు. దీంతో ఐరన్ లోపం తలెత్తుతుంది. ఫలితంగా మన శరీరం పలు లక్షణాలను మనకు తెలియజేస్తుంది. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ అవసరం. అయితే ఐరన్ తగినంతగా లభించనప్పుడు హిమోగ్లోబిన్ సరిగ్గా ఉత్పత్తి కాదు. దీంతో శరీరంలోని కణాలకు సరిగ్గా ఆక్సిజన్ లభించదు. ఫలితంగా మనం తీవ్రంగా అలసిపోయినట్లు ఫీలవుతాం. అలాగే నీరసంగా కూడా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఐరన్ లోపం వచ్చిందని తెలుసుకోవాలి. ఐరన్ లోపం ఉంటే ఎర్ర రక్త కణాలు సరిగ్గా ఉత్పత్తి కావు. కనుక చర్మం ఎరుపు రంగు నుంచి పాలిపోయిన తెలుపు రంగులోకి మారుతుంది. ఇలా గనక ఉంటే కచ్చితంగా ఐరన్ లోపించిందని గుర్తించాలి.
ఐరన్ లోపిస్తే హిమోగ్లోబిన్ సరిగ్గా ఉత్పత్తి కాదు కనుక శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరిగ్గా లభించదు. దీంతో కణాలు ఆక్సిజన్ కోసం చూస్తుంటాయి. కానీ ఆక్సిజన్ లభించే అవకాశం ఉండదు కనుక మనకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాగే ఐరన్ లోపించిన వారిలో గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. దీంతోపాటు రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుంది. దీని వల్ల కాళ్లను ఆడిస్తూ ఉండాల్సి వస్తుంది. అలాగే ఐరన్ లోపం ఉన్నవారిలో తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఐరన్ లోపించిన వారిలో చేతులు, పాదాలు చల్లగా ఉంటాయి. గోర్లు విరిగిపోతాయి, వెంట్రుకలు చిట్లిపోతాయి. నోట్లో, నాలుకపై ఎర్రగా కనిపిస్తుంది. ఆకలి ఉండదు. ఈ లక్షణాలు ఉంటే ఐరన్ లోపం ఉందని గుర్తించాలి. వెంటనే ఐరన్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఐరన్ మనకు ఎక్కువగా మటన్, రాజ్మా, దానిమ్మ పండ్లు, యాపిల్ పండ్లు, బాదం పప్పు, టమాటాలు, బ్రొకలీ, పాలకూర, వాల్ నట్స్, ఓట్స్, పప్పు దినుసులు, తృణ ధాన్యాల్లో ఎక్కువగా లభిస్తుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది. దీంతో పైన తెలిపిన లక్షణాలు అన్నీ మాయం అవుతాయి. అప్పుడు ఆరోగ్యంగా ఉండవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…