Chewing Gum : ముఖానికి వ్యాయామం అవుతుందని కొందరు.. సరదాగా కొందరు.. అలవాటు ప్రకారం ఇంకొందరు.. తరచూ చూయింగ్ గమ్‌లను నములుతుంటారు. అయితే చూయింగ్ గమ్‌లు నిజానికి మనకు తీవ్రమైన దుష్పరిణామాలను కలిగించవని ఇప్పటి వరకు భావిస్తూ వచ్చారు. కానీ అది నిజం కాదని.. చూయింగ్ గమ్‌ల వల్ల మన పేగుల్లో సమస్యలు వస్తాయని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌కు చెందిన కొందరు పరిశోధకులు చూయింగ్ గమ్‌లను నమిలే కొందరిపై పరిశోధనలు చేశారు. చూయింగ్ గమ్‌లలో ఉండే టైటానియం డయాక్సైడ్ అనబడే ఓ రసాయనిక సమ్మేళనం మన పేగులకు సమస్యలను తెచ్చి పెడుతుందని ఆ సైంటిస్టులు తేల్చారు. సదరు రసాయనం వల్ల పేగులు మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను సరిగ్గా గ్రహించలేవని నిర్దారించారు.
చూయింగ్ గమ్‌లను ఎక్కువగా నమిలే వారిలో పోషకాహార సమస్యలు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ గమ్‌లలో ఉండే టైటానియం డయాక్సైడ్ వల్ల పేగులు మనం తినే ఆహారంలో ఉండే ఐరన్, జింక్, ఫ్యాటీ యాసిడ్లు తదితర పోషకాలను గ్రహించలేవని చెబుతున్నారు. కనుక చూయింగ్ గమ్‌లను తినేవారు వాటికి దూరంగా ఉంటే మంచిదని సైంటిస్టులు సలహా ఇస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…