Lambasingi Movie Review : ప్రతివారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ వారం కూడా ప్రేక్షకులను పదుల సంఖ్యలో సినిమాలు అలరించనున్నాయి. ఇక ఈ వారం రిలీజ్ అవుతున్న మూవీల్లో ‘లంబసింగి’ ఒకటి. ‘బిగ్ బాస్’ దివి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పకులుగా వ్యవహరిస్తూ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ‘కాన్సెప్ట్ ఫిల్మ్స్’ బ్యానర్ పై ఆనంద్ తన్నీరు ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహించగా భరత్ రాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. శుక్రవారం అంటే మార్చి 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా, లేదా అన్నది చూద్దాం.
వీరబాబు(భరత్ రాజ్) కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవుతాడు. లంబసింగి అనే ఊరిలో అతనికి పోస్టింగ్ పడుతుంది. ఆ ఊరిలో బస్సు దిగగానే హరిత(దివి) ని చూసి ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె ఓ మాజీ నక్సలైట్ కూతురు అని తెలుస్తుంది. ఆ ఊరిలో నక్సలైట్లుగా ఉన్న చాలా మందికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. అందులో దివి తండ్రి ఒకరు. అలాంటి వారితో పోలీసులు రోజూ సంతకాలు పెట్టించుకుని వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఈ పని వీరబాబుకి అప్పగిస్తారు. హరితని ప్రేమలో పడేయడానికి అతను కూడా రోజూ ఆమె తండ్రితో సంతకం పెట్టిస్తుంటాడు, అందుకు ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడు.
హరిత ఆ ఊరి హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. ఓ రోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడే క్రమంలో హరితకి మరింత దగ్గరవుతాడు వీరబాబు. దీంతో అదే మంచి సమయం అని భావించి హరితకి తన ప్రేమ గురించి చెప్పాలని డిసైడ్ అవుతాడు. ఓ రోజు హరితకి తన ప్రేమని వ్యక్తపరచగా ఆమె అందుకు ఒప్పుకోదు. దీంతో నిరాశకు చెందిన వీరబాబు ఓ రోజు అతను మాత్రమే పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉండగా కొందరు నక్సలైట్లు దాడి చేసి అక్కడ ఉన్న అక్రమ ఆయుధాలను తీసుకెళ్ళిపోతారు. అందులో గాయపడిన వీరబాబుకి ఊహించని షాక్ ఎదురవుతుంది. ఆ షాక్ ఏంటి? అసలు హరిత తన ప్రేమని ఎందుకు నిరాకరించింది? ఆమె గతం ఏంటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
‘లంబసింగి’ చాలా మంచి కథ అని చెప్పవచ్చు. దర్శకుడు నవీన్ గాంధీ ఎంపిక చేసుకున్న పాయింట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో మొదట కొంచెం స్లోగా అనిపించినా.. తర్వాత వేగం పుంజుకుంటుంది. హీరోయిన్ ట్రాక్ ను దర్శకుడు డిజైన్ చేసిన తీరు బాగుంది. కొన్ని వన్ లైన్స్ కూడా బాగా పేలాయి. ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే ట్విస్ట్ కట్టిపడేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం మొదటి నుండి ఇంట్రెస్టింగ్ గా నడిపించాడు దర్శకుడు. ఎక్కడా కూడా ప్రేక్షకులు ఆలోచనలో పడే టైం ఇవ్వడు. స్క్రీన్ ప్లేని చాలా పకడ్బందీగా డిజైన్ చేసుకున్నాడు. వీరబాబు, రాజు గారు పాత్రలతో చేయించిన కామెడీ అలరిస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. థియేటర్ నుండి బయటకి వచ్చే ప్రేక్షకుడు ఆ ఫీల్ ను క్యారీ చేస్తూ వస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు.
దర్శకుడు నవీన్ గాంధీ ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా ‘లంబసింగి’ ని తెరకెక్కించాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. 2 గంటల 2 నిమిషాల పాటు ప్రతి ప్రేక్షకుడు ‘లంబసింగి’ అనే ప్రపంచంలోకి వెళ్లిపోయేలా చేశాడు. ఆర్.ఆర్.ధృవన్ అందించిన సంగీతం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో ఓ చిన్న సినిమాలో ఇలాంటి పాటలు ఉంటాయని, వింటామని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఒక్కసారి వినగానే ప్రతి పాట ఎక్కేసేలా ఉంటుంది. తెరపై కూడా వాటిని అందంగా ప్రెజెంట్ చేశాడు కె.బుజ్జి. ఎడిటర్ విజయ్ వర్ధన్ కావూరి కూడా తన పనితనంతో మెప్పించాడు.
నటీనటుల విషయానికి వస్తే.. దివిని ఎక్కువగా గ్లామర్ కోసమే అన్నట్టు దర్శకులు వాడుతూ వచ్చారు. కానీ ఆమెలో సహజమైన నటి ఉందని ‘లంబసింగి’ ద్వారా అందరికీ తెలిసొచ్చింది. హరిత అనే పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఆమె పాత్రలో ట్విస్ట్‌లు కూడా ఉంటాయి. దర్శకుడు నవీన్ గాంధీలా మిగిలిన దర్శకులు కూడా దివిలో ఉన్న నటిని గమనిస్తే కచ్చితంగా ఆమె సినీ కెరీర్ మరోలా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక హీరో భరత్ కూడా వీరబాబు అనే పాత్రలో చాలా నేచురల్ గా నటించాడు. క్లైమాక్స్ లో ఇతని ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు వేయించుకుంటాడు. అలాగే కామెడీతో అలరించాడు అని చెప్పాలి. ఇక వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య.. వంటి నటీనటులు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.
‘లంబసింగి’ కచ్చితంగా ప్రతి ప్రేక్షకుడిని అలరించే సినిమా. 2 గంటల 2 నిమిషాల పాటు ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కచ్చితంగా ఈ వీకెండ్ కి థియేటర్లలో మిస్ కాకుండా చూడదగ్గ చిత్రం.
రేటింగ్ : 3/5
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…