Mutton : నేడు నడుస్తున్నది ఆధునిక యుగం మాత్రమే కాదు. కల్తీ యుగం కూడా. అసలు అది, ఇది అని తేడా లేకుండా ప్రస్తుతం అన్ని ఆహారాలను కల్తీ చేస్తున్నారు. దీంతో ఏది కల్తీ కాదో గుర్తించడం మనకు చాలా కష్టతరమవుతోంది. అయితే కల్తీ విషయానికి వస్తే.. మనం తినే నాన్‌వెజ్ ఐటమ్ అయిన మటన్‌లో అది ఇంకా ఎక్కువ జరుగుతుంది. అంటే.. కుళ్లిపోయిన మాంసం అమ్మడమో, బాగా కొవ్వు ఉన్న కూర అమ్మడమో .. లేదా ఎప్పుడో కట్ చేసిన మటన్‌ను అమ్మడమో చేస్తుంటారు. దీంతో మనం మోసపోవాల్సి వస్తుంది. అయితే అలా జరగకుండా ఉండాలంటే.. కింద చెప్పిన సూచనలు పాటించాలి. దీంతో మటన్‌లో కల్తీని గుర్తించడం చాలా తేలికవుతుంది. మరి ఆ సూచనలు ఏమిటంటే..
మంచి మటన్ చాలా తాజాగా కనిపిస్తుంది. అదే మంచి మటన్ కాకపోతే పాలిపోయి, ఎండిపోయినట్లుగా ఉంటుంది. మంచి మటన్ మనకు జ్యూసీగా కనిపిస్తుంది. మటన్ నుంచి రక్తం, నీరు కారుతుంటే దాన్ని తీసుకోకూడదు. బాగా ఎరుపు రంగులో మటన్ ఉంటే అందులో కొవ్వు ఎక్కువగా ఉంటుందని, అది ముదిరిపోయిన మటన్ అని గ్రహించాలి. గులాబీ, ఎరుపు మధ్య రంగులో ఉండే మటన్ అయితే శ్రేయస్కరం.
చాలా మంది బోన్‌లెస్ మటన్‌ను తింటుంటారు. అయితే బోన్‌లెస్ కన్నా విత్ బోన్ మటనే రుచిగా ఉంటుంది. పైగా బోన్స్ మటనే త్వరగా ఉడుకుతుంది. దీనికి తోడు బోన్స్ మటన్‌లోనే పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక బోన్స్ మటన్‌నే ఎక్కువగా తినాలి. ఆన్‌లైన్‌లో మటన్‌ను ఎప్పుడూ ఆర్డర్ ఇవ్వరాదు. ఎందుకంటే.. వాళ్లు ఎలాంటి మటన్ తెస్తారో మనకు తెలియదు కదా. మార్కెట్ లో అయితే మనం మటన్‌ను చూసి.. మనకు నచ్చితేనే కొంటాం. కానీ ఆన్‌లైన్‌లో ఆ అవకాశం ఉండదు. కనుక ఎప్పుడూ ఆన్‌లైన్ లో మటన్‌ను ఆర్డర్ చేయరాదు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…