Eucalyptus Oil : మనకు కలిగే అనేక అనారోగ్యాలను నయం చేసుకునేందుకు మనకు అనేక రకాల సహజసిద్ధమైన పదార్థాలు ఔషధాలుగా అందుబాటులో ఉన్నాయి. వాటిలో నీలగిరి తైలం కూడా ఒకటి. దీన్ని నీలగిరి చెట్ల నుంచి తీస్తారు. అయితే ఈ ఆయిల్ మనకు అనేక లాభాలను ఇస్తుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. నీలగిరి తైలం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమల సమస్యతో బాధపడే వారు వాటిపై నిత్యం రెండు పూటలా కొద్దిగా నీలగిరి తైలాన్ని రాయాలి. దీంతో అతి తక్కువ సమయంలోనే మొటిమల నుంచి బయట పడవచ్చు. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇతర మచ్చలు కూడా పోతాయి. దుస్తులు ఉతికేటప్పుడు కొద్దిగా నీలగిరి తైలం వేసి వాటిని ఉతకాలి. దీంతో దుస్తులకు పట్టి ఉండే ఫంగస్, ఇతర క్రిములు నశిస్తాయి. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే బెడ్‌షీట్లు, దిండు కవర్లు తదితర ఇతర వస్త్రాలపై కూడా నీలగిరి తైలం చల్లుతుంటే అవి సువాసన వస్తాయి. అంతేకాకుండా క్రిములు రాకుండా ఉంటాయి. ఒక పాత్రలో వేడి నీటిని తీసుకుని అందులో కొద్దిగా నీలగిరి తైలం వేసి ఆపైన వచ్చే ఆవిరిని బాగా పీల్చాలి. ఇలా రోజుకు 2, 3 సార్లు చేస్తే ఎంతటి జలుబైనా త్వరగా తగ్గుతుంది. అలాగే దగ్గు, ముక్కు దిబ్బడ, ఫ్లూ జ్వరం తదితర ఇతర శ్వాస కోశ సమస్యలు కూడా నయమవుతాయి.
శరీరంలో నొప్పులు ఉన్న ప్రదేశంలో నీలగిరి తైలం రాసి ఆయా భాగాల్లో వేడి నీటి కాపడం పెట్టాలి. దీంతో నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల కీళ్లు, కండరాల నొప్పులు త్వరగా తగ్గుతాయి. కొబ్బరినూనెకు కొద్దిగా నీలగిరి తైలం కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. తరువాత కొంతసేపు ఆగి తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు బాధ నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే షాంపూలోనూ కొద్దిగా ఈ ఆయిల్ కలిపి తలస్నానం చేసినా చుండ్రు నుంచి తప్పించుకోవచ్చు. గోరు వెచ్చని నీరు కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా నీలగిరి తైలం వేసి బాగా కలిపి దాంతో నోరు పుక్కిలించాలి. రోజూ ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది.
నిత్యం ఆహారంలో నీలగిరి తైలం చేర్చి తీసుకోవడం వల్ల డయాబెటిస్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. నీలగిరి తైలంలో యాంటీ డయాబెటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ తైలాన్ని నిత్యం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…