Foods For Sleep : ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ యుగ నడుస్తోంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు చాలా మంది వేగంగా పనులు చేస్తున్నారు. అంతా బాగానే ఉంటుంది కానీ నిద్ర విషయంలోనే చాలా మంది సరిగ్గా శ్రద్ధ వహించడం లేదు. నిద్ర సరిగ్గాపోకపోతే అనేక తీవ్ర దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం చాలా మందికి తెలియడం లేదు. నిద్ర సరిగ్గా లేకపోతే అధిక బరువు పెరుగుతారు. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు రెండింతలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. కనుక ఎవరైనా సరే రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాల్సి ఉంటుంది. పెద్దలు అయితే రోజుకు 6 నుంచి 8 గంటలు, చిన్నారులు 10 గంటల వరకు నిద్రించాలి.
అయితే ఒత్తిడి, ఆందోళన కారణంగానే చాలా మందికి నిద్ర పట్టడం లేదని తెలుస్తోంది. డిప్రెషన్ కూడా తోడవడం దీనికి కారణం అవుతోంది. కానీ కింద చెప్పిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలను చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ పాలు తాగడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని పాలను తాగాలి. అందులో కాస్త తేనె కలిపితే ఇంకా మంచిది. దీంతో పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్ర చక్కగా పడుతుంది.
పాలలో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం ఉంటుంది. అందువల్ల పాలను తాగితే మన శరీరం సెరొటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి నిద్ర హార్మోన్లు. కనుక మనకు నిద్ర చక్కగా పట్టేలా చేస్తాయి. కాబట్టి రోజూ రాత్రి పాలను తాగితే మంచిది. దీంతో చక్కగా నిద్రించవచ్చు. అలాగే ఉదయం ఆహారంలో ఓట్ మీల్‌ను తినాలి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవడమే కాకుండా, రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది.
అరటి పండ్లు, వాల్ నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకున్నా కూడా రోజూ నిద్ర పోవచ్చు. వాల్ నట్స్‌ను ఉదయం నానబెట్టి సాయంత్రం తినాలి. ఇక అరటి పండును సాయంత్రం పూట స్నాక్స్ రూపంలో తినాలి. అలాగే కమోమిల్ టీ, బాదంపప్పు, కివి పండ్లు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా నిద్ర చక్కగా పడుతుంది. ఇవన్నీ నిద్రను ప్రోత్సహించే ఆహారాలు. కాబట్టి వీటిని తినడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. నిద్ర చక్కగా పడుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…