Skin Problems : వర్షాకాలంలో చాలా మందికి చర్మ సమస్యలు వస్తుంటాయి. వాటిల్లో కురుపులు, మొటిమలు, దురదలు కూడా ఉంటాయి. ముఖ్యంగా చిన్నారులు మురికి నీటిలో ఎక్కువగా ఆడుతారు. కనుక వారికే ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్యాక్టీరియా వల్ల కూడా చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. దీంతోపాటు కొందరికి ఈ సీజన్‌లో మొటిమలు ఎక్కువగా వస్తాయి. అయితే పలు సహజసిద్దమైన చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వేప ఆకులు లేదా బెరడు, వేప పండ్లు మనకు వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలను తగ్గించడంలో ఎంతగానో పనిచేస్తాయి. కురుపులు, మొటిమలు ఉంటే వేపాకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని చల్లార్చి దాంతో తలస్నానం చేయాలి. దీంతో ఇన్ఫెక్షన్లు రావు. అలాగే వేపాకులను పేస్ట్‌లా చేసి శరీరానికి పట్టించి కాసేపు అయ్యాక స్నానం చేయవచ్చు. ఇలా చేసినా కూడా ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
ఇక చాలా మంది ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది. ఇందులో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. తులసి మనల్ని చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. తులసి ఆకుల రసాన్నిశరీరానికి అప్లై చేయవచ్చు. దీంతో కురుపులు, మొటిమలు, ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కలబంద కూడా పనిచేస్తుంది. కలబంద గుజ్జును కూడా చర్మానికి రాయవచ్చు. దీంతోపాటు తమలపాకులు కూడా చర్మాన్ని సంరక్షించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని పేస్టులా చేసి చర్మానికి రాసుకుంటే ఇన్‌ఫెక్షన్లు తగ్గడమే కాదు, మొటిమలు, మచ్చల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఇలా ఈ నాచురల్ టిప్స్‌ను పాటించడం ద్వారా వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…