Drumstick Leaves : మునగకాయలతో మనం అనేక రకాల కూరలను చేసుకుని తింటుంటాం. ఇవి మనకు చక్కని రుచిని మాత్రమే కాదు, అనేక పోషకాలను కూడా అందిస్తాయి. మునగకాయలతో ఏ కూర చేసినా చాలా మంది ఇష్టంగానే తింటారు. అయితే నిజానికి మునగకాయల కన్నా మునగ ఆకులను తింటే ఇంకా మనకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. మునగ ఆకుతో కూర చేసుకుని తినవచ్చు. లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే.. మునగ ఆకు మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే మన చర్మాన్ని సంరక్షించడంలో విటమిన్ సి ఎంతగానో దోహదపడుతుంది. మునగాకును తింటే చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. ఈ ఆకుల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకులలో ఉండే ఐరన్ రక్తహీనతను పోగొడుతుంది. దీన్ని తింటే రక్తం బాగా తయారవుతుంది.
మునగ ఆకుల్లో ఉండే కాల్షియం మన శరీరంలో ఎముకలు, దంతాలను దృఢంగా చేస్తుంది. ఎముకలు బలంగా మారుతాయి. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. మునగ ఆకులను రోజూ తీసుకుంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఆకులను తినడం వల్ల క్యాన్సర్ కణాలు పెరగవు. బాగా తలనొప్పిగా ఉంటే మునగ ఆకు రసాన్ని తాగితే వెంటనే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మధుమేహం ఉన్నవారు మునగ ఆకు రసాన్ని రోజూ తాగితే బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఇలా మునగాకులతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…