lifestyle

Dreams And Their Meanings : గాల్లో ఎగురుతున్న‌ట్లు క‌ల వ‌చ్చిందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Dreams And Their Meanings : మ‌న‌కు క‌ల‌లు రావ‌డ‌మ‌నేది చాలా స‌హ‌జ‌మైన విష‌యం. ప్ర‌తి ఒక్క‌రికి నిత్యం క‌ల‌లు వ‌స్తుంటాయి. వాటిల్లో కొన్ని పీడ‌క‌ల‌లు అయి ఉంటాయి. ఇక కొంద‌రికి భిన్న ర‌కాల క‌లలు వ‌స్తాయి. అయితే పురాణాలు చెబుతున్న ప్ర‌కారం.. క‌ల‌లో క‌నిపించిన‌వి నిజం అయ్యే అవ‌కాశాలు ఉంటాయని కొంద‌రు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఎలాంటి క‌ల‌లు వ‌స్తే.. అంటే.. క‌ల‌లో ఏం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తే.. వేటిని మ‌నం చూస్తే.. వాటి ఫ‌లితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

కల‌లో చేప‌లు క‌నిపిస్తే ఇంట్లో శుభ‌కార్యం జ‌రుగుతుంద‌ని తెలుసుకోవాలి. అదే మాంసం తింటున్న‌ట్లు క‌ల‌గంటే.. మీకు గాయాలు అవుతాయ‌ని అర్థం చేసుకోవాలి. క‌ల‌లో దెబ్బలు తింటున్న‌ట్లు క‌నిపిస్తే మీరు ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులు అవుతార‌న్న‌మాటే. అదే గాల్లో తేలిన‌ట్లు క‌నిపిస్తే ప్ర‌యాణం చేస్తార‌ని అర్థం. కాళ్లు, చేతులు క‌డుగుతున్న‌ట్లు క‌ల‌లో క‌నిపిస్తే మీకున్న అన్ని ర‌కాల దుఖాలు, స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని తెలుసుకోవాలి. అలాగే క‌ల‌లో పెళ్లి కూతురును ముద్దాడుతున్న‌ట్లు క‌నిపించినా మీకున్న స‌మ‌స్య‌లు పోతాయ‌ని తెలుసుకోవాలి.

మీకు క‌ల‌లో పాము క‌నిపిస్తే మీకు భ‌విష్య‌త్తులో అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ని తెలుసుకోవాలి. క‌ల‌లో ఒంటె క‌నిపిస్తే మీకు రాజ‌భ‌యం ఉంటుంద‌ని అర్థం. క‌ల‌లో మిమ్మ‌ల్ని పెద్ద‌లు దీవిస్తున్న‌ట్లు క‌నిపిస్తే మీకు స‌మాజంలో గౌర‌వ ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయ‌ని తెలుసుకోవాలి. అలాగే మీరు క‌ల‌లో పాలు తాగుతున్న‌ట్లు క‌నిపించినా మీకు ఇదే ఫ‌లితం వస్తుంది. అదే క‌ల‌లో నీరు తాగుతున్న‌ట్లు క‌నిపిస్తే మీకు ఐశ్వ‌ర్యం క‌లుగుతుంద‌ని తెలుసుకోవాలి. క‌ల‌లో కుక్క మిమ్మ‌ల్ని క‌రిచిన‌ట్లు క‌నిపిస్తే త్వ‌ర‌లో క‌ష్టాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ట‌. అదే ఎగురుతున్న ప‌క్షిని చూస్తే స‌మాజంలో మీకు గౌర‌వం పెరుగుతుంద‌ట‌. నెమ‌లి క‌నిపిస్తే మీకు దుఃఖం క‌లుగుతుంద‌ట‌.

Dreams And Their Meanings

మీకు పెళ్లి అయిన‌ట్లు క‌ల‌వ‌స్తే మీకు ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ట‌. క‌ల‌లో కుంకుమ పెట్టుకున్న‌ట్లు క‌నిపిస్తే మీ ఇంట్లో శుభ కార్యం జ‌రుగుతుంద‌ట‌. క‌ల‌లో అద్దం క‌నిపిస్తే మానసిక ఆందోళ‌నకు గుర‌వుతార‌ట‌. రైలు ఎక్కుతున్న‌ట్లు క‌ల వ‌స్తే యాత్ర చేస్తార‌ని భావించాలి. ఇక కాలుజారి ప‌డిన‌ట్లు క‌ల వ‌స్తే మీకు అష్ట‌క‌ష్టాలు ఎదుర‌వుతాయ‌ని తెలుసుకోవాలి. క‌ల‌లో ఆవు దొరికిన‌ట్లు వ‌స్తే భూలాభం ఉంటుంది. గుర్రం మీద నుంచి కింద ప‌డిన‌ట్లు క‌ల వ‌స్తే ప‌ద‌వీ త్యాగం చేయాల్సి వ‌స్తుంద‌ట‌. గుర్రం ఎక్కిన‌ట్లు క‌ల వ‌స్తే మీకు ప‌దోన్న‌తి క‌లుగుతుంద‌ట‌. మీరు చ‌నిపోయిన‌ట్లు మీకు క‌ల వ‌స్తే మీకున్న స‌మ‌స్య‌లు పోతాయ‌ట‌.

స‌ముద్రం, విక‌సిస్తున్న పూలు, యువ‌తితో క‌ల‌వ‌డం లేదా చూడ‌డం, ప్ర‌సాదం ల‌భించిన‌ట్లు, ఆశీర్వాదం తీసుకున్న‌ట్లు, పుస్త‌కం చ‌దువుతున్న‌ట్లు, పాము క‌రిచిన‌ట్లు, ఆల‌యాన్ని చూసిన‌ట్లు, న‌గ‌లు దొరికిన‌ట్లు, ఏనుగుపై స్వారీ చేసిన‌ట్లు, పండ్లు తిన్న‌ట్లు, శ‌రీరంపై పేడ పూసిన‌ట్లు క‌ల‌లు వ‌స్తే ధ‌న‌లాభం క‌లుగుతుంద‌ట‌. క‌ల‌లో ర‌క్తం క‌న‌ప‌డినా, స్త‌న‌పానం చేసిన‌ట్లు క‌ల వ‌చ్చినా, నూనె తాగిన‌ట్లు క‌ల వ‌చ్చినా, స్వీట్లు తిన్న‌ట్లు, వివాహం అయిన‌ట్లు క‌ల‌లు వ‌చ్చినా, క‌ల‌లో పోలీసుల‌ను చూసినా, గుండు చేయింంచుకున్న‌ట్లు క‌ల వ‌చ్చినా వారు మ‌ర‌ణ వార్త వింటార‌ట‌.

విధ‌వ‌కు గ‌డ్డం పెరిగిన‌ట్లు క‌ల‌వ‌స్తే వారికి మ‌ళ్లీ వివాహం జ‌రుగుతుంద‌ట‌. అలాగే పెళ్ల‌యిన వారికి త‌మ జీవిత భాగ‌స్వామి వెంట్రుక‌లు తెల్ల‌బ‌డిన‌ట్లు క‌ల‌లో క‌నిపిస్తే వారు విడాకులు తీసుకుంటార‌ట‌. లేదా వారి బంధం తెగిపోతుంద‌ట‌. ఇలా మ‌న‌కు వ‌చ్చే క‌ల‌ల‌ను బ‌ట్టి వాటి ఫ‌లితాల‌ను మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM