lifestyle

Chicken Pulao : హోటల్స్ మాదిరిగా చికెన్ పులావ్‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసేయండి..!

Chicken Pulao : చికెన్‌తో రెగ్యులర్ గా కూర లేదా ఫ్రై చేసుకుని తింటే ఏం బాగుంటుంది చెప్పండి. మ‌నిష‌న్నాక ఆ మాత్రం క‌ళాపోష‌ణ ఉండాలి. చికెన్ తో కూర లేదా ఫ్రై ఎవ‌రైనా చేసుకుని తింటారు. కానీ దాంతో పులావ్ చేసుకుని మీరు ఎప్పుడైనా తిన్నారా ? అవును.. చికెన్ పులావ్ ను మీరు ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ దాకా వెళ్లాల్సిన ప‌నిలేదు. ప‌దార్థాలు, కొద్దిగా శ్ర‌మ ఉంటే చాలు.. వేడి వేడి చికెన్ పులావ్ త‌యార‌వుతుంది. మరి దాని త‌యారీకి ఏమేం ప‌దార్థాలు అవ‌సర‌మో, దాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

చికెన్ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బాస్మతి బియ్యం – 2 కప్పులు, చికెన్ ముక్కలు – అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్టు – 2 టీ స్పూన్లు, ఉల్లిముక్క – 1 (పెద్దది), యాలకులు – 3, లవంగాలు – 3, పులావు ఆకు – 3, స్టార్ అనిస్ – 2, దాల్చిన చెక్క – 1, పచ్చి మిరపకాయలు – 3, గరం మసాలా పొడి – 1 టీస్పూను, కారం – 1 టీస్పూను, పసుపు – 1 టీ స్పూను, పెరుగు – 2 టీ స్పూన్లు, ఉప్పు – త‌గినంత, నూనె – త‌గినంత.

Chicken Pulao

చికెన్ పులావ్ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ముక్క‌ల‌ను శుభ్రంగా క‌డ‌గాలి. అనంత‌రం వాటిని ఒక పాత్ర‌లోకి తీసుకోవాలి. అందులో కారం, గ‌రం మసాలా, పసుపు, ఉప్పు, 1 టీస్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా క‌లిపి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీంతో చికెన్ మారినేట్ అవుతుంది. పాన్ తీసుకుని అందులో నూనె వేసి, నూనె వేడెక్కాక పులావ్ ఆకు, ల‌వంగాలు, యాల‌కులు, దాల్చిన చెక్క‌, స్టార్ అనిస్ వేసి బాగా వేయించాలి. అనంత‌రం ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌ల‌ను నిలువుగా కోసి ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయ్యాక మారినేట్ చేయ‌బ‌డిన చికెన్‌ను వేసి బాగా క‌లిపి వండాలి.

అందులో 2 క‌ప్పుల పెరుగు వేసి బాగా క‌ల‌పాలి. చికెన్ ముక్క‌లు స‌గం ఉడికే వ‌ర‌కు అలా ఉడికించాలి. త‌రువాత క‌డిగిన బియ్యం వేసి క‌ల‌పాలి. బియ్యం ఉడికేందుకు 4 క‌ప్పుల నీరు పోయాలి. అనంత‌రం అందులో చిటికెడు ప‌సుపు, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, త‌గినంత ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. అన్నం ఉడికాక దించేముందు ఒక‌సారి గ‌రిటెతో క‌లియ‌బెట్టాలి. అంతే.. ఘుమ ఘుమ‌లాడే వేడి వేడి చికెన్ పులావ్ త‌యార‌వుతుంది. దీన్ని అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
IDL Desk

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM