Orange Peels : నారింజ పండ్లను తినడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. నారింజ పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అవన్నీ మన శరీరానికి అవసరమే. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. అయితే నారింజ పండ్లే కాదు.. వాటి తొక్కల్లోనూ అనేక పోషకాలు ఉంటాయి. కానీ చాలా మంది నారింజ పండ్లను తిన్న తరువాత తొక్కలను పడేస్తుంటారు. అలా చేయకండి. నారింజ పండ్ల తొక్కలను సరిగ్గా ఉపయోగించాలే కానీ మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
నారింజ పండ్లు తొక్కల ద్వారా మనకు ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, మనం వాటిని ఇంకా ఎన్నో రకాలుగా వాడవచ్చు. నారింజ పండ్ల తొక్కల్లో విటమిన్ సి, డైటరీ ఫైబర్, విటమిన్ ఎ, క్యాల్షియం, ఫోలేట్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువల్ల ఈ తొక్కలను నీటిలో వేసి మరిగించి తాగితే మనం ఆయా పోషకాలను పొందవచ్చు. అలాగే ఈ తొక్కల్లో డి-లిమోనీన్ అనే సమ్మేళనం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల నారింజ పండు తొక్కలను క్లీన్ చేసే పదార్ధంగా కూడా ఉపయోగించవచ్చు.
నారింజ పండు తొక్కల్లో ఉండే డి-లిమోనీన్ అనే సమ్మేళనం నాచురల్ డిగ్రీజర్, డిసిన్‌ఫెక్టెంట్‌గా పనిచేస్తుంది. అందువల్ల ఈ తొక్కలను ఉపయోగించి పాత్రలను క్లీన్ చేయవచ్చు. దీంతో వాటిపై ఉండే మొండి మరకలు కూడా పోతాయి. అలాగే చెక్క ఫర్నిచర్‌కు ఈ తొక్కలతో పాలిష్ వేయవచ్చు. సింపుల్‌గా ఈ తొక్కలను ఫర్నిచర్‌పై రుద్దితే చాలు, ఫర్నిచర్ మెరుస్తుంది. అలాగే వెనిగర్‌లో ఈ తొక్కలను నానబెట్టి వాడితే ఆ ద్రవం చక్కని క్లీనింగ్ స్ప్రే గా కూడా పనిచేస్తుంది.
నారింజ పండు తొక్కలను ఫ్రిజ్‌లో పెడితే ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసన పోతుంది. ఈ తొక్కలను చెత్త డబ్బాలో కూడా ఉంచవచ్చు. దీంతో అందులో నుంచి వచ్చే వాసన కూడా పోతుంది. అలాగే మీ చేతుల నుంచి వెల్లుల్లి లేదా ఉల్లిపాయల స్మెల్ వస్తుంటే మీ చేతులకు నారింజ పండు తొక్కలను రుద్దాలి. దీంతో వాటి వాసన పోతుంది. నారింజ పండు తొక్కలను వేసి మరిగించిన నీళ్లను మీరు చక్కని రూమ్ ఫ్రెషనర్ గా కూడా వాడవచ్చు. నారింజ పండు తొక్కలను వేయడం వల్ల చేదుగా ఉండే వంటలకు రుచి వస్తుంది.
ఈ తొక్కలను ఉపయోగించి కేక్స్, కుకీస్, మారినేడ్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే వీటిని ఎండ బెట్టి పొడి చేసి స్నాక్స్ తయారీలో ఉపయోగించవచ్చు. నారింజ పండు తొక్కలను మీ ఇంట్లో మొక్కలకు ఎరువుగా కూడా వేయవచ్చు. అలాగే ఈ తొక్కలను కిటికీలు, కిచెన్‌లో అక్కడక్కడా ఉంచితే పురుగులు, బొద్దింకల బెడద నుంచి విముక్తి లభిస్తుంది. నారింజ పండు తొక్కలను పేస్ట్‌లా చేసి ఫేస్ ప్యాక్‌గా కూడా వాడవచ్చు. దీంతో మీ ముఖం కాంతివంతంగా మారి మెరిసిపోతుంది. ఇలా నారింజ పండు తొక్కలతో అనేక విధాలుగా ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఇకపై వాటిని పడేయకండి. ఎంచక్కా పైన చెప్పిన విధంగా మీకు నచ్చినట్లు వాటిని ఉపయోగించుకోండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…