Cold And Cough : సీజన్ మారుతున్నప్పుడు సహజంగానే చాలా మందికి దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే ఇవి రాగానే వెంటనే మెడికల్ షాపుకు వెళ్లి మందులను తెచ్చి వేసుకుంటారు. ఇలా తరచూ మెడిసిన్లను వాడడం మంచిది కాదు. నాచురల్ టిప్స్‌ను పాటిస్తే ఆరోగ్యంపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పడకుండా ఉంటాయి. ఇక దగ్గు, జలుబును వదిలించుకోవాలంటే అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలను వదిలించడంలో తులసి ఆకులు మనకు అద్భుతంగా పనిచేస్తాయి. తులసి ఆకులను నేరుగా నమిలి తినవచ్చు. లేదా తులసి ఆకుల రసంలో తేనె కలిపి తీసుకోవచ్చు.
తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ టీని తాగుతున్నా ఉపశమనం లభిస్తుంది. సీజనల్ వ్యాధులను తగ్గించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో తులసి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే అతి మధురం చూర్ణం కూడా మనకు పనిచేస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త అతి మధురం చూర్ణం కలిపి తాగుతుంటే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే దాల్చిన చెక్క పొడి, తులసి ఆకులు, ఎండు మిర్చి పొడి వేసి మరిగించిన కషాయాన్ని తాగుతుంటే దగ్గు, జలుబు నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది.
తిప్పతీగ కూడా రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సహాయం చేస్తుంది. తిప్పతీగ రసాన్ని రోజూ ఉదయం, సాయంత్రం అర టీస్పూన్ మోతాదులో సేవించాలి. లేదా కషాయం కూడా తాగవచ్చు. ఈవిధంగా సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…