lifestyle

Aloo Rice : ఆలు రైస్ చిటికెలో ఇలా చేయ‌వ‌చ్చు.. మ‌ధ్యాహ్నం లంచ్‌లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Aloo Rice : ప‌ని ఒత్తిడి, అల‌స‌ట లేదా.. ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌నం ఒక్కోసారి బ‌య‌టి నుంచి ఆహారాన్ని పార్శిల్ తెచ్చుకుని ఇండ్ల‌లో తింటుంటాం. అయితే కొంచెం ఓపిక చేసుకోవాలే గానీ.. 10 నిమిషాల్లో చ‌క్క‌ని రైస్ వంట‌కాన్ని మ‌న‌మే స్వ‌యంగా చేసుకుని ఆర‌గించ‌వ‌చ్చు. అందుకు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. అలాంటి సుల‌భ‌త‌ర‌మైన రైస్ వంట‌కాల్లో ఆలు రైస్ కూడా ఒక‌టి. మ‌రి దీన్ని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

ఆలు రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – 1 క‌ప్పు, ఆలుగ‌డ్డ‌లు – 2 (ఉడ‌క‌బెట్టిన‌వి), ఉల్లిపాయ – 1 (ముక్క‌లుగా క‌ట్ చేయాలి), వెల్లుల్లి రెబ్బ‌లు – 2 (ముక్క‌లుగా క‌ట్ చేయాలి), పుదీనా త‌రుగు – 2 టీస్పూన్లు, పచ్చి మిర్చి – 1, గ‌రం మ‌సాలా, షాజీరా – 1/2 టీ స్పూన్, కారం – 1/4 టీస్పూన్, ప‌సుపు – చిటికెడు, నూనె, ఉప్పు – త‌గినంత, బిరియానీ ఆకు, జాజికాయ – ఒక్కొక్క‌టి, యాల‌కులు – 4, దాల్చిన చెక్క – 1 అంగుళం, ల‌వంగాలు – 6.

Aloo Rice

ఆలు రైస్ త‌యారు చేసే విధానం..

ఆలుగ‌డ్డ‌ల‌ను నీళ్లు పోసి ఉడ‌క‌బెట్టాలి. ఒక గిన్నెలో నూనె పోసి వేడి చేయాలి. అనంత‌రం అందులో బిర్యానీ ఆకు, యాల‌కులు, దాల్చిన చెక్క, ల‌వంగాలు, ప‌చ్చి మిర్చి, షాజీరా, జాజికాయ వేసి వేయించాలి. అందులో ఉల్లిపాయ‌లు, వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించాలి. అనంత‌రం ఉడ‌క‌బెట్టిన‌ ఆలుగ‌డ్డ ముక్క‌ల‌ను వేయాలి. వాటిని కొంత‌సేపు ఫ్రై చేయాలి. అనంత‌రం అందులో ప‌సుపు, ఉప్పు, కారం, పుదీనా ఆకులు, గ‌రం మ‌సాలా వేసి బాగా క‌ల‌పాలి. ఆ త‌రువాత అన్నం వేయాలి. రెండు నిమిషాల పాటు బాగా క‌ల‌పాలి. అనంత‌రం కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి బాగా క‌ల‌పాలి. దీంతో ఆలురైస్ త‌యార‌వుతుంది. దీన్ని రైతాతో క‌లిపి తిన‌వ‌చ్చు. లేద‌గా కారంగా చేసుకుంటే రైతా లేకుండానే తిన‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM