karthika deepam

మోనిత పైశాచికత్వం.. డాక్టర్ బాబును బెదిరించి పెళ్లికి ముహూర్తం పెట్టిన మోనిత..

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతోంది. గత ఎపిసోడ్ లో కడుపునొప్పితో బాధపడుతూ డాక్టర్ బాబు హాస్పిటల్ లో చేరగా మోనిత కనిపించి డాక్టర్ బాబును భయాందోళనలకు గురిచేస్తుంది. తను చెప్పినట్టు వినకపోతే కుటుంబాన్ని మొత్తం చంపేస్తానని మోనిత బెదిరించడంతో డాక్టర్ బాబు అయోమయంలో పడతాడు. నేడు 1133 వ ఎపిసోడ్ లోకి ఎంటరైన ఈ సీరియల్ హైలెట్స్ ఏమిటో చూద్దాం.

డాక్టర్ బాబు హాస్పిటల్ లో మోనిత కనిపించి చెప్పిన మాటలు అన్నింటిని గుర్తుచేసుకుంటూ ఆందోళన పడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన దీపతో నువ్వు జాగ్రత్త. ఒంటరిగా ఎక్కడికీకి వెళ్ళకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను చూసుకోవడానికి ఆదిత్యను పంపించు అంటూ కంగారు పడతాడు. ఆ తర్వాత వద్దు నువ్వు ఇక్కడే ఉండు, రౌడీని చూసుకోవడానికి మమ్మీ డాడీ ఉన్నారంటూ కంగారు పడటం చూసిన దీప.. డాక్టర్ బాబు మానసికంగా బాగా డిస్టర్బ్ అయినట్లున్నాడు అంటూ మనసులో బాధ పడుతుంది.

ఇక మోనిత తన బిడ్డతో మాట్లాడుతూ మీ నాన్నను చూశావా.. ఎంత అందంగా ఉన్నాడు కదా.. మీ నాన్న చాలా మంచివాడు.. నువ్వు బయటకు వచ్చేలోగా మీ నాన్నని కూడా బయటకు తీసుకు వస్తాను. మీ నాన్నను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను, అలాంటిది మీ నాన్న మీ పెద్దమ్మ అదే ఆ వంటలక్క కోసం తాపత్రయపడుతున్నాడు అంటూ తన కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడుతుంది. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చే లోపు అన్నీ సెటిల్ చేస్తా అంటూ మందులు వేసుకుంటుంది.

ఇక హిమ సౌర్య తన తండ్రి గురించి బాధపడుతూ దీపను అనరాని మాటలు అంటారు. నాన్నను ఎప్పుడు బయటకు తీసుకు వస్తారు. మీరు కానీ అమ్మకానికి, తాతయ్య బాబాయ్ ఎవరు కూడా నాన్నను బయటకు తీసుకు రాలేకపోతున్నారు అంటూ సౌందర్యతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే అందుకు సౌందర్య సౌర్య పై కోపడుతుంది. అయినా తప్పు మాదే మిమ్మల్ని చిన్నప్పటినుంచి వేరువేరుగా పెంచి వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొకసారి నా కోడలు గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు అంటూ పిల్లలకు వార్నింగ్ ఇస్తుంది.

ఇక మరుసటి రోజు ఉదయం దీప కార్తీక్ రూమ్ లోకి వెళితే బెడ్ పై కార్తీ కనిపించడు. కంగారుతో డాక్టర్ బాబు ఎక్కడ అని అడిగితే పోలీసులు కంగారు పడకు అమ్మ అక్కడ కూర్చున్నారు అంటూ చూపిస్తారు. బయటకు వెళ్లిన దీప డాక్టర్ బాబు దగ్గర కూర్చుని మీరు దేనికైనా భయపడుతున్నారా.. హాస్పిటల్ కి వచ్చాక మీలో ధైర్యం చచ్చిపోయింది, ఏమైంది డాక్టర్ బాబు అని అడుగుతుంది. అందుకు కార్తీక్ మోనితను చూసి నేను భయపడుతున్నానా, నేను ఇలా భయపడితే అందరూ కంగారు పడతారు అంటూ మనసులో అనుకొని ఏమీ లేదు దీపా మీరంతా నా వల్ల బాధ పడుతున్నారు.. అని అంటాడు. మీ వల్ల బాధ పడటం లేదండీ, మీరు చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తున్నారని అందరు బాధపడుతున్నాము. మీరు ధైర్యంగా ఉండండి ఒకప్పుడు మా అందరి కోసం మీరు ఉన్నారు. ఇప్పుడు మేమంతా నీ ఒక్కడి కోసం ఉంటున్నాము. అంటూ ధైర్యం చెబుతుంది.

డాక్టర్ బాబు మాట్లాడుతూ తెలుసు దీపా.. నేను పుట్టి పెరిగిన ఇన్ని రోజులకు ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నాను అని సమాధానం చెబుతాడు. అయినప్పటికీ మోనిత చెప్పిన మాటలకు డాక్టర్ బాబు కంగారు పడుతుంటాడు. ఇక నువ్వు ఇంటికి వెళ్లి ఆదిత్యను, డాడీని రమ్మని చెప్పు,అసలే రౌడీకి జ్వరం గా ఉంది నేను హాస్పిటల్లో ఉన్నానని చెప్పకు దీప అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగియగా రేపటి ఎపిసోడ్ లో దీప వెళ్తుంటే దీప నువ్వంటే నాకు చాలా ఇష్టం అని డాక్టర్ బాబు దీపతో చెప్పగా దీప మొహంలో బాధతో కూడిన చిరు నవ్వు వస్తుంది. ఇక మోనిత కార్తీక్ తో తాళి కట్టించుకోవాలని పెద్ద పథకం వేసింది. రేపటి ఎపిసోడ్ లో కార్తీక్ పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Share
Sailaja N

Recent Posts

Rs 200 Notes : రూ.200 నోట్లు తీసుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Rs 200 Notes : కేంద్రంలో మోదీ ప్ర‌భుత్వం చాలా ఏళ్ల కింద‌ట రూ.500, రూ.1000 నోట్ల‌ను ర‌ద్దు చేసిన…

Sunday, 19 May 2024, 4:56 PM

Fruits In Fridge : ఈ పండ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ మీరు ఫ్రిజ్‌లో పెట్ట‌వ‌ద్దు..!

Fruits In Fridge : వేసవి కాలం ప్రారంభం కాగానే చాలా మంది ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం ప్రారంభిస్తారు,…

Sunday, 19 May 2024, 11:06 AM

How To Increase Breast Milk : ఈ ఆహారాల‌ను తింటే చాలు.. బాలింత‌ల్లో స‌హ‌జ‌సిద్ధంగా పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి..!

How To Increase Breast Milk : గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌లు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న సంగ‌తి తెలిసిందే. కాస్త…

Saturday, 18 May 2024, 8:47 PM

Telugu OTT : ఈ వారం ఓటీటీల్లో 7 సినిమాలు.. వాటిల్లో 4 బాగా స్పెష‌ల్‌.. స్ట్రీమింగ్ వేటిలో అంటే..?

Telugu OTT : వారం వారం ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలో…

Saturday, 18 May 2024, 6:18 PM

Eggs In Summer : వేస‌విలో కోడిగుడ్ల‌ను తిన‌డం మంచిది కాదా..?

Eggs In Summer : గుడ్డు ఒక ఆరోగ్యకరమైన మరియు సూపర్ ఫుడ్. ఎందుకంటే విటమిన్ బి12, బి6, బి5,…

Saturday, 18 May 2024, 11:42 AM

Lemon Buying : నిమ్మ‌కాయ‌ల‌ను కొంటున్నారా.. అయితే ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Lemon Buying : నిమ్మకాయల‌ను భారతీయులు ఇంట్లో మరియు వంటగదిలో అనేక రకాలుగా ఉపయోగిస్తారు. రుచిలో పుల్లగా ఉండే నిమ్మకాయలు…

Saturday, 18 May 2024, 9:04 AM

Hibiscus Tea : మందార పువ్వుల టీని రోజూ తాగితే.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

Hibiscus Tea : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో ఎన్నో ర‌కాల మొక్క‌లు క‌నిపిస్తుంటాయి. వాటిల్లో కొన్ని అంద‌మైన పుష్పాలు పూస్తాయి.…

Friday, 17 May 2024, 7:53 PM

Whiten Teeth : ఈ నాచుర‌ల్ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ దంతాలు తెల్ల‌గా మెరిసిపోతాయి..!

Whiten Teeth : మ‌న శ‌రీరంలోని అవ‌య‌వాల్లో దంతాలు కూడా ఒక‌టి. చాలా మంది వీటి ఆరోగ్యంపై దృష్టి పెట్ట‌రు.…

Friday, 17 May 2024, 6:17 PM