ఐటీ రంగంలో జాబ్ చేయాలని అనుకుంటున్నారా..? అయితే మీకు టెక్ మహీంద్రా సదవకాశం కల్పిస్తోంది. ఐటీ, బీపీవో, కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు గాను టెక్ మహీంద్రా కంపెనీ వారు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఫుల్ టైమ్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేస్తారు. డిగ్రీ లేదా పీజీ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఫ్రెషర్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఆఫీస్ అయితే నోయిడాలో పనిచేయాల్సి ఉంటుంది.
కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌గా అభ్యర్థులు రోజుకు 3 షిఫ్టుల్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఫ్రెషర్స్‌కు ఈ నియామక ప్రక్రియ ఎంతగానో దోహదం చేస్తుంది. ఐటీ రంగంలో ఎదగాలని చూస్తున్నవారికి ఇదొక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో భాగంగా కస్టమర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. వారి సందేహాలను నివృత్తి చేయాలి. సమస్యలను పరిష్కరించాలి. కస్టమర్ సంతృప్తే ప్రధాన లక్ష్యంగా పనిచేయాల్సి ఉంటుంది. చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు కంప్యూటర్‌పై అవగాహన, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను కలిగి ఉండాలి.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఏడాదికి రూ.3 లక్షల ప్రారంభ వేతనం లభిస్తుంది. ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పిస్తారు. ట్రావెల్ అలవెన్స్‌ను కల్పిస్తారు. మరిన్ని వివరాలకు ఎ6, నోయిడా సెక్టార్ 64, నియర్ సహార్ కట్, నియర్ సెక్టార్ 62 మెట్రో స్టేషన్ చిరునామాలో సంప్రదించవచ్చు. లేదా అనుపమ్ (7011087542), దియా (8448603147), సలోని శర్మ (8800817179)లను వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే ss00858347@techmahindra.com అనే ఈ-మెయిల్‌కు మెయిల్‌ను పంపించవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయాలని ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పైన ఇచ్చిన ఫోన్ నంబర్లను లేదా మెయిల్ ఐడీలో కంపెనీని సంప్రదించవచ్చు. లేదా చిరునామాలో జరిగే వాకిన్ ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావచ్చు.
మీరు టెన్త్ లేదా ఇంటర్ చదివారా..? ప‌్రభుత్వ ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే ఈ అవకాశం మీ కోసమే. డైరెక్టరేట్…
దేశంలోని ప్రముఖ ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ సంస్థ టీసీఎస్ డిగ్రీ, పీజీ, సీఏ చదివిన అభ్యర్థులకు చక్కని ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.…
రైల్వేలో జాబ్ పొందాలని చూస్తున్నారా..? అయితే ఈ నోటిఫికేషన్ మీ కోసమే. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) పలు విభాగాల్లో…
ది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) వారు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
దేశంలోని ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ టెక్ మహీంద్రా పలు విభాగాల్లో ఆసక్తి, అర్హత ఉన్న…
CSIR నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (NIIST) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి…
దేశంలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి…