మీరు టెన్త్ లేదా ఇంటర్ చదివారా..? ప‌్రభుత్వ ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే ఈ అవకాశం మీ కోసమే. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (DGAFMS)లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్, ఎల్‌డీసీ, స్టోర్ కీపర్, ఫైర్‌మ్యాన్, కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 113 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఫిబ్రవరి నెల మొత్తం గడువు ఇచ్చారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.
టెన్త్ లేదా ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. అకౌంటెంట్ పోస్టుకు మాత్రం బీకామ్ చదివి ఉండాలి. కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా 30 ఏళ్ల వరకు ఉండవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
https://dgafms24.onlineapplicationform.org/DGAFMS/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అభ్యర్థులు మరింత సమాచారం తెలుసుకోవచ్చు. ఈ సైట్‌లోనే ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. ఇందులో అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత అప్లికేషన్ ఫామ్ నింపాలి. అందులో వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు, పని అనుభవం ఉంటే ఆ వివరాలను నమోదు చేయాలి. తరువాత అవసరం అయిన ధ్రువ పత్రాలను అప్ లోడ్ చేయాలి. ఫోటో, సంతకం, ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. తరువాత అప్లికేషన్‌ను సబ్ మిట్ చేయవచ్చు.
ఈ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ధ్రువ పత్రాల పరిశీలన ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఫైర్ మన్, ఎంటీఎస్ పోస్టులకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ పే కమిషన్ ఆధారంగా వేతనాలను చెల్లిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.
ఐటీ రంగంలో జాబ్ చేయాలని అనుకుంటున్నారా..? అయితే మీకు టెక్ మహీంద్రా సదవకాశం కల్పిస్తోంది. ఐటీ, బీపీవో, కస్టమర్ సపోర్ట్…
దేశంలోని ప్రముఖ ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ సంస్థ టీసీఎస్ డిగ్రీ, పీజీ, సీఏ చదివిన అభ్యర్థులకు చక్కని ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.…
రైల్వేలో జాబ్ పొందాలని చూస్తున్నారా..? అయితే ఈ నోటిఫికేషన్ మీ కోసమే. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) పలు విభాగాల్లో…
ది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) వారు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
దేశంలోని ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ టెక్ మహీంద్రా పలు విభాగాల్లో ఆసక్తి, అర్హత ఉన్న…
CSIR నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (NIIST) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి…
దేశంలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి…