Teleperformance Jobs 2023 : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకోసమే ఈ నోటిఫికేషన్. తెలుగు వారి కోసం భారీగా అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్ లని తీసుకు వస్తున్నాము. ప్రముఖ సంస్థ టెలి పర్ఫామెన్స్ నుండి రిలీజ్ చేసిన భారీ నోటిఫికేషన్ గురించిన వివరాలని పొందుపరిచాము. ఇక టెలిపర్ఫామెన్స్ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ కంపెనీయే ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాన్ని కూడా ఇస్తుంది. మరి అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోండి.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థలలో ఒకటైనటువంటి టెలి పర్ఫామెన్స్ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కస్టమర్ సక్సెస్ అసోసియేట్ ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 500 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. కనీసం ఆరు నెలల అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని టెలి పర్ఫామెన్స్ నోటిఫికేషన్ లో చెప్పింది. స్మార్ట్ ఫోన్ వినియోగం, స్థానిక భాష మాట్లాడటం, కంప్యూటర్ సేల్స్, కస్టమర్ హ్యాండిలింగ్ స్కిల్స్, చదవడం, రాయడం రావడం, నేర్చుకునే సామర్థ్యం ఉన్నవాళ్లు ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు విషయానికి వస్తే.. ఈ పోస్ట్ కి దరఖాస్తు చేసుకునే వాళ్ళ వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఏడాదికి లక్షన్నర నుండి 2.25 లక్షల వరకు కంపెనీ వాళ్ళు ఇస్తారు. అలాగే ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఎలాంటి ఫీజు లేకుండా ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
https://www.naukri.com/job-listings-pan-india-work-from-home-contractual-teleperformance-tp-mohali-punjab-0-to-1-years-070823003024