SBI Jobs : దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం రెండు వేల పోస్టులకు నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలని తెలుసుకుందాం. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 7 నుండి ప్రారంభమైంది. ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవడానికి టైం వుంది. రెండు వేల ప్రొబిషనరీ ఆఫీసర్ పోస్టులు వున్నాయి. ఓబీసీలకు 540 పోస్టులు, ఎస్సీలకు 300, ఎస్టీలకు 150, ఈడబ్ల్యూఎస్‌లకు 200 వున్నాయి. అలాగే యూఆర్‌లకు 810 ఖాళీలు వున్నాయి.
ఇక అర్హత గురించి చూస్తే ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ప్రభుత్వ సంస్థ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న వాళ్ళైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వయస్సు విషయానికి వస్తే కనీస వయసు ఏప్రిల్ 1, 2023 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉంటే దరఖాస్తు చేయవచ్చు.

ఎస్సీ లేదా ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఐదేళ్లు చొప్పున వయసులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద రూ.750 చెల్లించాల్సి వుంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు వుంది.
ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. ప్రిలిమినరీ పరీక్షను మొదట నిర్వహిస్తారు. ఆ తరవాత ఇందులో ఉత్తీర్ణులైన వాళ్ళు మెయిన్స్ పరీక్షని రాయాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో సెలెక్ట్ అయితే, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇంకా ఓవర్ ఆల్ గా ఎంపిక చేస్తారు. అధికారిక వెబ్‌సైట్ https://bank.sbi/careers/current-openings లో పూర్తి వివరాలు ఉంటాయి. చెక్ చేసుకోవచ్చు.