SBI Jobs 2023 : ఒక మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్. దేశీయ దిగజా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొఫెషనల్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. మామూలుగా అయితే ఈ గడువు ముగిసిపోయింది. కానీ మరోసారి దరఖాస్తులు గడువుని పొడిగించారు. అక్టోబర్ 3 వరకు అవకాశం వుంది. కాబట్టి, ఇక ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే, దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 2000 పిఓ పోస్టుల భర్తీకి, సెప్టెంబర్ 7న ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైన సంగతి మనకి తెలుసు. ఇక నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు లోకి వెళితే… మొత్తం ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు 2000 ఉన్నాయి. క్యాటగిరీల వారీగా చూస్తే… ఎస్సీ 300, ఎస్టి 150, ఓబిసి 540, ఈడబ్ల్యూఎస్ 200, యుఆర్ 810. ఇక శాలరీ విషయానికి వస్తే.. ఎంపికైన వాళ్ళకి బేసిక్ పే 41,960 గా ఉంది. అలానే, ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి.

ఇక వయసు విషయానికి వస్తే… ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వాళ్ళ వయసు, ఏప్రిల్ ఒకటి 2023 నాటికి 21 ఏళ్లు పూర్తయి ఉండాలి. 30 ఏళ్లు దాటకూడదు. ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబిసి మూడేళ్లు, దివ్యాంగులకి 10 నుండి 15 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ తదితరులకి ఐదేళ్ల చొప్పున వయోసడలింపు ఉంది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్ససైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయబోతున్నారు.
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూబీడీ వాళ్లకి ఎలాంటి ఫీజు లేదు. నవంబర్లో ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. డిసెంబర్ లేదా జనవరిలో ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష ఉంటుంది. జనవరి లేదా ఫిబ్రవరిలో సైకోమెట్రిక్, ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్ససైజ్ పరీక్షలు ఉంటాయి. ఫిబ్రవరి లేదా మార్చి లో ఫలితాలు రిలీజ్ చేస్తారు.