దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో మొత్తం 61 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు గాను రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) ఇటీవలే నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా ఆసక్తి, అర్హత ఉన్న క్రీడాకారులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 3ను చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://scr.indianrailways.gov.in/ ను సందర్శించవచ్చు.
ఈ పోస్టులకు గాను అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి. క్రీడాంశాల్లో వివిధ స్థాయిలో విజయాలను సాధించి ఉండాలి. అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, గోల్ఫ్, చెస్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, ఖోఖో క్రీడల్లో విజయం సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 01.01.2025 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
విద్యార్మతలు, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన వారు రూ.250 చెల్లించాలి.