PhonePe Jobs 2023 : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే, మీకు ఇది గుడ్ న్యూస్. చాలామంది నిరుద్యోగులు, మంచి ఉద్యోగం దొరికితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా వారిలో ఒకరైతే, కచ్చితంగా ఈ నోటిఫికేషన్ వివరాలు చూడండి. తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ ని, మేము మీకోసం తీసుకు వస్తున్నాము. ఈరోజు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ ఫోన్ పే నుండి నోటిఫికేషన్ వచ్చింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఫోన్ పే ని వాడుతున్నారు. ఫోన్ పే ద్వారా మనం ఈజీగా డబ్బులని ఇతరులకి పంపవచ్చు. అలానే మనం పొందవచ్చు. ఫోన్ పే లో ఉద్యోగం చేయాలనుకుంటే, ఈ వివరాలను కచ్చితంగా తెలుసుకోండి. ఈ భారీ రిక్రూట్మెంట్ భారత దేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫారం సంస్థ ఫోన్ పే నుండి వచ్చింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, బహుళ భాషల్లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అలానే, కంప్యూటర్ స్కిల్స్ కూడా కచ్చితంగా ఉండాలి. ఇంగ్లీష్, హిందీలో రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. బీమా సలహా, సేల్స్ లో అనుభవం ఉంటే మంచిది. మల్టీ టాస్క్ చేయగలగాలి. గ్రాడ్యుయేషన్ తప్పనిసరిగా పూర్తయి ఉండాలి. మరి ఇక వయస్సు విషయానికి వస్తే.. ఈ ఉద్యోగం కోసం అప్లై చేయాలనుకునే వాళ్ళ వయసు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
18 సంవత్సరాలు నిండితే, ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక జీతం విషయానికి వస్తే, ఈ సంస్థలో మీరు పని చేస్తే నెలకి రూ.35,000 వేల వరకు జీతం ఇస్తారు. అలానే, ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. మొబైల్ లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నారు. మిగిలిన వివరాల కోసం దరఖాస్తు చేసుకోవడం కోసం కింద లింక్ ని క్లిక్ చేయండి.
https://boards.greenhouse.io/embed/job_app?token=5705867003