CSIR నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (NIIST) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నిషియన్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు గాను ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అయినా సరే దరఖాస్తు చేయవచ్చు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు గాను ఆన్‌లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్‌లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. దరఖాస్తులను సమర్పించేందుకు మార్చి 14ను చివరి తేదీగా నిర్ణయించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఇచ్చారు. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నిషియన్ పోస్టులకు గాను టెన్త్, ఇంటర్, డిప్లొమా చదివి ఉండాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన అర్హతలో ఉత్తీర్ణులు అయి ఉండాలి. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి.
అప్లికేషన్ ఫీజును రూ.500గా నిర్ణయించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. దరఖాస్తు రుసుమును ఆన్ లైన్‌లో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. ఈ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువ పత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు నెలవారి వేతనం చెల్లిస్తారు. దీంతోపాటు ప్రత్యేక అలవెన్స్‌లను కూడా చెల్లిస్తారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు గాను https://www.niist.res.in/ అనే అధికారిక సైట్‌ను సందర్శించవచ్చు. అందులోనే ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై కూడా చేయవచ్చు.
దేశంలోని ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ టెక్ మహీంద్రా పలు విభాగాల్లో ఆసక్తి, అర్హత ఉన్న…
దేశంలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి…
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో ఉఏన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖలలో పలు విభాగాల్లో పనిచేయడానికి గాను ఆసక్తి, అర్హత…
మీరు రైల్వేలో ఖాళీల కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే ఈ అవకాశం మీ కోసమే. ఎందుకంటే బీహార్‌లోని పాట్నాలో ఉన్న…
దేశవ్యాప్తంగా ఉన్న పలు జోన్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి…
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత…
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఏది చేసినా సంచలనమే అవుతుంది. అయితే తాజాగా ఈయన…