దేశంలోని ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ టెక్ మహీంద్రా పలు విభాగాల్లో ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశాలను కల్పిస్తోంది. ఫిబ్రవరి 8వ తేదీన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న టెక్ మహీంద్రా కార్యాలయంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల మధ్య ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. మాదాపూర్ హైటెక్‌సిటీలో ఉన్న ఎస్ఈజడ్ గేట్ 2, ఇన్ఫోసిటీ స్పెషల్ ఎకనామిక్ జోన్, టవర్ 2, ప్లాట్ నం.22 నుంచి 34 వరకు ఉన్న చిరునామాలో టెక్ మహీంద్రా కార్యాలయం ఉంది. ఆసక్తి, అర్హత ఉన్న వారు ఈ చిరునామాలో ఆ తేదీన జరగబోయే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
టెక్ మహీంద్రాలో ఎలక్ట్రికల్ ఇంజినీర్, సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, లీడ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులకు డిప్లొమా చదివిన వారు అర్హులు. సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ చదివి ఉండాలి. ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటీఎక్ చదివి ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
ఈ పోస్టులకు ఎలాంటి దరఖాస్తు చేయాల్సిన పనిలేదు. పైన చెప్పిన చిరునామా, తేదీ, సమయం నాడు జరిగే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, రెజ్యూమ్‌తో హాజరు కావచ్చు. మరిన్ని వివరాలకు గాను AB001076800@techmahindra.com అనే చిరునామాకు ఈ-మెయిల్ పంపవచ్చు.
CSIR నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (NIIST) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి…
దేశంలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి…
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో ఉఏన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖలలో పలు విభాగాల్లో పనిచేయడానికి గాను ఆసక్తి, అర్హత…
మీరు రైల్వేలో ఖాళీల కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే ఈ అవకాశం మీ కోసమే. ఎందుకంటే బీహార్‌లోని పాట్నాలో ఉన్న…
దేశవ్యాప్తంగా ఉన్న పలు జోన్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి…
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత…
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఏది చేసినా సంచలనమే అవుతుంది. అయితే తాజాగా ఈయన…