Congizant Work From Home Job : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు ఇదే గుడ్ న్యూస్. తాజాగా కాగ్నిజంట్ ఒక నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. అర్హులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే కచ్చితంగా వయసు 18 నిండి ఉండాలి. ఇక మిగిలిన వివరాలను, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చూసేద్దాం. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురుచూసే వాళ్ళు ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ కి దరఖాస్తు చేయవచ్చు. కంటెంట్ మోడరేటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది కంపెనీ.
ఇక విద్యార్హతల వివరాలలోకి వెళితే.. డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టులకి దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు చేసుకునే వాళ్లకి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా రూ.35,000 వరకు జీతం ఇస్తారు. చిన్న టెస్ట్ నిర్వహించి భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి కంపనీ ఫ్రీ గా లాప్‌టాప్ ని కూడా ఇస్తుంది.

ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. ఫీజు కింద ఏమీ కట్టక్కర్లేదు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే అప్లై చేయవచ్చు. జీతం గురించి చూస్తే.. జాబ్ లో చేరగానే నెలకు రూ.35,000 దాకా జీతం ఇస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించి దాని ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష కూడా లేదు.
జాబ్ లొకేషన్ వివరాలు చూస్తే.. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్‌లో రూ.35,000 జీతం ఇస్తారు. ఆన్‌లైన్ లో మీరు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసేయవచ్చు. కేవలం కంపెనీ వెబ్‌సైట్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి.