స్వయం ఉపాధి మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఆలోచన ఉంటే చాలు. దాంతో ఎంతటి వారైనా ఏమైనా సాధించవచ్చు. కొద్దిగా కష్టపడుతూ ఓపిగ్గా, మెళకువగా వ్యాపారం చేస్తే ఎవరైనా సక్సెస్ సాధిస్తారు. సరిగ్గా ఇవే విషయాలను అలవర్చుకున్నాడు. కనుకనే అతను పలు మార్లు ఫెయిల్ అయినా.. చివరకు వినూత్న ఐడియాతో ఏటా రూ.కోట్లు సంపాదిస్తున్నాడు. అతనే కేశవ్ రాయ్.
కేశవ్ రాయ్ స్కూల్‌లో యావరేజ్ స్టూడెంటే. కానీ సొంతంగా ఏదైనా చేయాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విపరీతంగా ఆలోచించాడు. దీంతో అతనికి సెమీ ఆటోమేటిక్ బైక్ కవర్లను తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. అందులో భాగంగానే 2016లో అతను బైక్ బ్లేజర్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. 2017లో తన ప్రొడక్ట్ కు పేటెంట్ పొందాడు. తరువాత అతను వెనక్కి తిరిగి చూడలేదు. దిన దిన ప్రవర్థమానం అన్నట్లు ఎదిగాడు.
కేశవ్ రాయ్ సొంతంగా తయారు చేసిన సెమీ ఆటోమేటిక్ బైక్ కవర్ ద్విచక్రవాహనదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దాన్ని వాహనానికి అమర్చితే చాలు 30 నిమిషాల్లో కవర్ అవుతుంది. దీంతో వర్షం పడినా ఏమీ కాదు. వాహనం పొడిగా ఉంటుంది. ఈ సెమీ ఆటోమేటిక్ బైక్ కవర్‌లను రూ.780, రూ.850 ధరలకు కొనుగోలు చేయవచ్చు. అన్ని ఈ-కామర్స్ సైట్లలోనూ ఈ కవర్స్ అందుబాటులో ఉన్నాయి.
కేశవ్ రాయ్ మొదట్లో తన బైక్ కవర్లను అమ్మేందుకు కొంత కష్టపడ్డాడు. కానీ వాటి గురించి తెలిశాక చాలా మంది వాటిని కొనడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో వాటి గురించి అతను విస్తృతంగా ప్రచారం చేశాడు. దీంతో తక్కువ సమయంలోనే ఆ బైక్ కవర్లకు ఆదరణ లభించింది. ఇక 5 ఏళ్ల కాలంలో అతను 75వేలకు పైగా అలాంటి కవర్లను విక్రయించగా.. ప్రస్తుతం అతనికి ఏడాదికి రూ.1.30 కోట్ల టర్నోవర్ వస్తోంది.
కేశవ్ రాయ్‌కు చెందిన బైక్ బ్లేజర్ పరిశ్రమ మొదట తన ఇంటి టెర్రేస్‌పై ప్రారంభమైంది. ఇప్పుడు ఢిల్లీ, ఘజియాబాద్‌లలో రెండు పరిశ్రమలను ఏర్పాటు చేసి అతను ఆ బైక్ కవర్లను ఉత్పత్తి చేస్తున్నాడు. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తానని చెబుతున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…